షాక్: తండ్రి అయిన హీరో శర్వానంద్.. కూతురు పేరు ఏమిటంటే..!!

Divya
టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్నారు. గత ఏడాది రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. జూన్ మూడవ తేదీన వీరి వివాహం గత ఏడాది చాలా గ్రాండ్గా జరిగింది.. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.. అయితే గత కొద్ది రోజులుగా హీరో శర్వనంద్ తండ్రి కాబోతున్నారని రక్షిత గర్భవతి అనే విషయం వైరల్ గా మారింది. అయితే ఈ విషయం పైన ఎక్కడ ఎవరు స్పందించలేదు.. పెళ్లి తర్వాత ఆమె తన వర్క్ కోసం అక్కడే ఉన్నదని శర్వ కూడా సినిమా షూటింగులు ఉండడం వల్ల ఇండియాలోనే ఉండిపోయారని తెలుస్తోంది..

అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు నోరు విప్పని శర్వా నిన్నటి రోజున తన బర్తడే సందర్భంగా తన తండ్రి అయినట్లు అధికారికంగా వెల్లడించారు.. తన భార్య రక్షిత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అంటూ కూడా వెల్లడించారు.. తన కూతురు పేరు లీలా దేవి మైనేని అని తెలియజేశారు. దీంతోపాటు శర్వ, రక్షిత లీలాతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది.. వైట్ దుస్తులను శర్వాదంపతులు తన పాపతో ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే శర్వానంద్ బర్త్డే రోజున తనకు కూతురు పుట్టిందని చెప్పడం చాలా బాగుందంటూ అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మనమే అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఈ చిత్రాన్ని శ్రీరామ ఆదిత్య తెరకెక్కిస్తూ ఉన్నారు.. యువి క్రియేషన్ బ్యానర్ పైన 36 వ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 37వ సినిమా అని కూడా డైరెక్టర్ రామ్అబ్బరాజు దర్శకత్వం వహించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: