నా కెరియర్ను మలుపు తిప్పిన.. 3 సినిమాలు అవే : మహేష్ బాబు

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం కథల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్న మహేష్ బాబు ప్రతి సినిమాతో కూడా సూపర్ హిట్ కొడుతూ ఉన్నాడు. ఇక సంక్రాంతికి బరిలోకి దిగుతూ మంచి విజయాలను అందుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఈ ఏడాది గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టాడు  కాగా ప్రస్తుతం ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళితో ఒక సినిమా చేస్తున్నాడు.

 ఈ మూవీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు వరుస ప్లాపులతో సతమతమైన మహేష్.. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతూ ఉండడంతో అభిమానుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలు ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. తన కెరియర్ లో మురారి సినిమా మొదటి బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఇక తర్వాత వచ్చిన పోకిరి ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రీమంతుడు మూవీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు సినిమాలు గురించి ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మహేష్ బాబు.

 మురారి పోకిరి శ్రీమంతుడు సినిమాలు తన కెరీర్ను మలుపు తిప్పాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మూడు చిత్రాలు తనను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇక ఈ మూడు సినిమాల విజయాలు సక్సెస్ విషయంలో తన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసాయి అంటూ తెలిపాడు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళితో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. ఇక ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు సూపర్ స్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: