విశ్వంభర కు బావల సమస్యలు !

frame విశ్వంభర కు బావల సమస్యలు !

Seetha Sailaja
చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని అనుకున్న విధంగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అన్న పక్కా ప్లాన్ లో ఉన్నారు. ఈ మూవీ కథ ప్రకారం చిరంజీవి పాత్రకు ఐదుగురు చెల్లెళ్ళు ఉంటారని ఇప్పటికే లీకులు వచ్చిన విషయం తెలిసిందే.  



ఈషా చావ్లా సురభి ఆషిక రంగనాథ్ మరో ఇద్దరు చెల్లెళ్ళ కోసం అన్వేషణ కొనసాగుతోంది. వీరు కాకుండా ఈమూవీలో మీనాక్షీ చౌదరీ మృణాల్ ఠాగూర్ కూడ ఉంటారని వార్తలు వస్తున్న నేపధ్యంలో వీరిద్దరి పాత్రల పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. చాలకాలం తరువాత త్రిష చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈమూవీలో చిరంజీవి చెల్లెళ్ళ పాత్రలకు భర్తలను వెతికే పనిలో ఈ మూవీ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.  



సుశాంత్ రాజ్ తరుణ్ లతో ఈవిషయమై ఇప్పటికే ఈ మూవీ యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ కథ రీత్యా వారి పాత్రల నిడివి చాల తక్కువ కాబట్టి ఎంతవరకు వారిద్దరు ఈమూవీలో నటించడానికి అంగీకరిస్తారు అన్న సందేహాలు ఉన్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. ‘భోళాశంకర్’ మూవీలో కీర్తి సురేష్ భర్తగా సుశాంత్ నటించినప్పటికీ అతడికి ఏమాత్రం పేరు రాని పరిస్థితులలో సుశాంత్ ఈమూవీ విషయంలో ఈ మూవీ విషయంలో ఆలోచనలు చేస్తున్నాడు అన్నమాటలు కూడ వినిపిస్తున్నాయి.



విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఈ మూవీ కథలో భారీ స్థాయిలో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉండబోతున్నట్లు టాక్. చిరంజీవి కెరియర్ లో ట్రెండ్ సేటర్ మూవీగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రేంజ్ లో ఈ మూవీ ఉంటుందని అంచనాలు వస్తున్న పరిస్థితులలో ఈమూవీ విడుదల కోసం అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..    




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: