మరోప్రయోగం చేస్తున్న కార్తికేయ !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగి పోయింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు అనేకమంది రాజమౌళిని హాలీవుడ్ కు రమ్మని ఆహ్వానించే స్థాయికి జక్కన్న ఎదిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీగా మహేష్ తో తీయబోతున్న సినిమాను సిద్ధం చేయడానికి రాజమౌళి తన వ్యూహాలను పదును పెడుతున్న విషయం తెలిసిందే.

జక్కన్న వారసుడుగా కార్తికేయ ను దర్శకుడుగా మార్చాలని రాజమౌళి భావించడం లేదు అని అంటారు. అందుకే అతడిని నిర్మాతగా మార్చాలని రాజమౌళి అతడితో చిన్న సినిమాల నిర్మాణం వైపు  అడుగులు వేయిస్తున్నాడు. అయితే చిన్న సినిమాల నిర్మాతగా అతడు ఇప్పటివరకు చేసిన ప్రయోగాలు అన్నీ విజయాన్ని తెచ్చి పెట్టలేదు. ప్రస్తుత తరం వారు మర్చిపోయిన రేడియోను గుర్తుకు చేస్తూ ‘ఆకాశవాణి’ అన్న టైటిల్ తో తీసిన చిన్న సినిమా కూడ ఫెయిల్ అయింది.

అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న ఉద్దేశ్యంతో మరో చిన్న సినిమా ప్రయోగం వైపు కార్తికేయ అడుగులు వేస్తున్నాడు. మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ అనే యూత్ ఫుల్ లవ్ స్టోరీని అదే టైటిల్ తో తెలుగులో డబ్ చేసి కార్తికేయ విడుదల చేయబోతున్నాడు. అమెరికాలో సెటిల్ అవ్వాలి అన్న భావంతో తన గ్రామం నుండి సిటీ వచ్చి తన అమెరికా ప్రయత్నాలు కొనసాగించే యువకుడు కి ఇండియాలో సెటిల్ అవ్వాలి అని భావించే ఒక అమ్మాయికి ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి ఆతరువాత విడిపోయే పరిస్థితులు ఎదురైనప్పుడు వచ్చే సంఘర్షణ అల్లబడిన ఒక క్యూట్ లవ్ స్టోరీని యధాతదంగా డబ్ చేసి విడుదల చేస్తున్నాడు కార్తికేయ.

వాస్తవానికి రాజమౌళి తాను తీసే సినిమాల షూటింగ్ సమయంలో నటీనటుల చేత డైలాగ్ రిహార్సల్స్ చేయించడం షూటింగ్ స్పాట్ లో అన్న ఏర్పాట్లు చేయడం కార్తికేయ చాల సమర్థవంతంగా చేస్తాడు అన్న పేరుంది. అయితే అతడు దర్శకుడుగా కాకుండా నిర్మాతగా మారాలని చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్న వారికి కార్తికేయ ఇక దర్శకుడుగా మారకపోవచ్చు అన్న సందేహాలు వస్తున్నాయి..      


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: