గోపీచంద్ కు కలిసివస్తున్న కాలం !

Seetha Sailaja
ప్రస్తుతతరం మీడియం రేంజ్ హీరోలలో గోపీచంద్ చాల సీనియర్. అయితే గత కొంతకాలంగా  హిట్ అన్నపదం అతడి కాంపౌండ్ లో  వినపడటంలేదు ఇలాంటి పరిస్థితుల మధ్య ఈవారం ‘మహా శివరాత్రి’ రోజున విడుదలకాబోతున్న ‘భీమా’ అతడు కోరుకున్న బ్రేక్ ఇచ్చే  అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈమూవీ ట్రైలర్  చూసిన వారికి ఈమూవీలో గోపీచంద్ ని డిఫరెంట్ గా చూపించినట్లు అనిపిస్తోంది.

పోలీస్ ఆఫీసర్ గా పల్లె ప్రజలలో ఒకడుగా ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో అతడు కనిపిస్తున్న నేపద్యంలో గోపీ చంద్ ఈమూవీలో ద్విపాత్రాభినయం చేశాడా అన్నసందేహాలు కొందరికి వస్తున్నాయి. గత కొంతకాలంగా వస్తున్న వరస పరాజయాలతో అతడి మార్కెట్ పూర్తిగా దెబ్బ తినడంతో అతడి సినిమాలకు బిజినెస్ అవ్వడం కష్టంగా ఉంది అన్నకామెంట్స్ వస్తున్నాయి.

ఈమూవీ దర్శకుడు ఏ హర్ష కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. కన్నడంలో అతడు చేసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ కూడ అయ్యాయి. టాప్ హీరో శివరాజ్ కుమార్ తో అతడు చేసిన సినిమాలు కొన్ని సూపర్ హిట్. మరో టాప్ హీరో పునీత రాజ్ కుమార్ తో కూడ ఇతడు సినిమాలు తీశాడు. ఇతడు సినిమాలకు డీవోషనల్ టచ్ ఇస్తూ మాస్ సినిమాలు తీయడంతో చేయి తిరిగిన వ్యక్తి అన్నపేరు ఉంది.

గతవారం విడుదలైన సినిమాలు అన్నీ చెప్పుకోతగ్గ స్థాయిలో విజయవంతం కాకపోవడంతో ఇప్పుడు ఈపరిస్థితి గోపీ చంద్ కు కలిసి వస్తుందా అన్న అంచనాలు వస్తున్నాయి. గతంలో గోపీ చంద్ పోలీస్ ఆఫీసర్ అవతారంలో చేసిన సినిమాలు చాలమటుకు హిట్. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అంటూ కొందరు అంచనాలు వేస్తున్నారు. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఫుల్ జోష్ తీసుకొచ్చిన మాస్ సినిమా ఏదీ లేకపోవడంతో ధియేటర్లు అన్నీ కలక్షన్స్ లేక వెలవెల పోతున్నాయి. ఈసినిమాకు 14 నుంచి 20 కోట్ల లోపు బిజినెస్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ మూవీకి ఎబో యావరేజ్ టాక్ వచ్చినా చాలు బయ్యర్లు చాల సులువుగా గట్టెక్కుతారు అంటూ ఇండస్ట్రీ వర్గాలు అంచనాలలో ఉన్నారు..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: