ఆహా ను కలవర పెడుతున్న డిస్నీ రిలయన్స్ డీల్ !

Seetha Sailaja
ప్రస్తుతం ధియేటర్లకు ప్రత్యామ్నాయంగా మారిన ఓటీటీ బిజినెస్ దేశవ్యాప్తంగా వేల కోట్ల స్థాయికి చేరుకుని కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఈ బిజినెస్ లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ప్రతి మధ్య తరగతి కుటుంబంలో బిగ్ స్క్రీన్ టీవీలు హోమ్ ధియేటర్లు ఉండటం సర్వసాధారణంగా మారిపోతున్న పరిస్థితులలో చాలమంది ఇళ్ళల్లోని డ్రాయింగ్ రూమ్స్  సినిమా ధియేటర్లుగా మారిపోతున్నాయి.

దీనితో అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలకు ఈ ట్రెండ్ వారికి అనుకూలంగా మారి వేల కోట్లల్లో బిజినెస్ లక్షల సంఖ్యలో ఓటీటీ చందాదారుల సంఖ్య ప్రతిరోజూ వేల సంఖ్యలో పెరిగిపోతోంది. నెట్ ఫ్లిక్స్ అమెజాన్ డిస్నీ హాట్ స్టార్ లాంటి సంస్థలు తీస్తున్న వెబ్ సిరీస్ లు భారీ సినిమాల స్థాయిని మించి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ మార్కెట్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆహా లాంటి తెలుగు ఓటీటీ సంస్థ చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు రకరకాల కారణాలతో ముందుకు సాగడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితుల మధ్య డిస్నీ రిలియన్స్ మధ్య కుదిరిన 8.5 బిలియన్ డాలర్ల డీల్ ఓటీటీ రంగంలో పెను మార్పులు తీసుకు వస్తుంది అని అంటున్నారు. రాబోయే రోజులలో ఈ డీల్ తో రిలేయన్స్ ఈ రంగంలో కూడ పూర్తి ఆధిపత్యం చెలాయించడం ఖాయం అని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నెట్ ఫ్లిక్స్ దూసుకుపోతుంటే అమెజాన్ ప్రైమ్ కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తోంది.

ఇలాంటి పరిస్థితులలో ఆహా ఈటీవీ విన్ లాంటి తెలుగు ఒటీటీ సంస్థలకు సమస్యలు తప్పవు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ పోటీలో ఈ తెలుగు యాప్స్ నిలబడాలి అంటే తమ వ్యూహాలను మార్చుకుని మరింత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: