"సింగం" మూవీకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం సూర్య హీరోగా అనుష్క హీరోయిన్ గా హరి దర్శకత్వంలో సింగం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ తమిళ , తెలుగు భాషలలో విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో సూర్య డ్రెస్సింగ్ స్టైల్ , బాడీ లాంగ్వేజ్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం ... అలాగే అనుష్క ఈ సినిమాలో తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఈ మూవీ తో సూర్య క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇకపోతే మొదటగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి హరి ఈ సినిమాను సూర్య తో కాకుండా తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ తో చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా ఈ సినిమా దర్శకుడు హరి , విజయ్ నీ కలిసి ఈ మూవీ కథను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడట. ఇకపోతే విజయ్ కి కూడా ఈ సినిమా కథ అద్భుతంగా నచ్చిందట. కాకపోతే ఆ సమయం లో విజయ్ వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పాడట.

అలా విజయ్ "సింగం" సినిమాలో నటించాను అని చెప్పిన తర్వాత హరి , సూర్య ను కలిసి ఈ కథను వినిపించాడట. సూర్య కు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా విజయ్ తో అనుకున్నా సింగం సినిమాను హరి ఆ తర్వాత సూర్య తో తెరకెక్కించాడు. సింగం మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పటివరకు సింగం సిరీస్ లో భాగంగా మొత్తం మూడు సినిమాలు రూపొందాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: