ఎవరైనా అలా అడిగితే.. చాలా కష్టంగా అనిపించేది : రానా

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన రామానాయుడు తెలుగు ఇండస్ట్రీకి చేసిన సేవలు గురించి మాటల్లో వర్ణించడం కూడా కష్టమే. ఏకంగా నిర్మాతగా రచయితగా డైరెక్టర్గా నటుడిగా కూడా ఆయన ప్రస్తానాన్ని కొనసాగించారు. ఏకంగా రామానాయుడు  స్టూడియోస్ ని ప్రారంభించి సెన్సేషన్ సృష్టించారు.  అయితే రామానాయుడు వారసుడిగా ఇక దగ్గుబాటి వెంకటేష్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తే, దగ్గుపాటి సురేష్ బాబు నిర్మాతగా ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

 అయితే ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరానికి హీరోగా పరిచయమయ్యాడు దగ్గుబాటి రామానాయుడు. ఇక తన పేరును షార్ట్ కట్ గా నేటి జనరేషన్ కు తగ్గట్లుగా రానా అని మార్చుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే నటుడుగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి కూడా రానా తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అందరిలా కమర్షియల్ హంగులు ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తాను అని కండిషన్స్ పెట్టుకోకుండా.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర ఏది వచ్చినా కూడా చేసేందుకు ముందుకు వస్తున్నాడు. ఇక తన నట విశ్వరూపంతో ప్రేక్షకులందరికీ కూడా మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు దగ్గుబాటి రానా.

 అయితే వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ కెరియర్లో బిజీ బిజీగా ఉన్న సమయంలోనే.. రానాను ఒక ఆరోగ్య సమస్య తీవ్రంగా వేధించింది. ఏకంగా కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. అయితే ఇక కిడ్నీ మార్పిడి తర్వాత రానా ఎంతగానో సన్నబడిపోవడంతో అభిమానులు సైతం షాక్ అయ్యారు. అయితే తన అనారోగ్యం గురించి రానా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్నేళ్ల క్రితమే తనకు కిడ్నీ మార్పిడి జరిగిందని చిన్న వయస్సులోనే  కార్నియా ఆపరేషన్ జరిగినట్లు చెప్పుకొచ్చాడు రానా. మనం ప్రాణాంతకమైన స్థితిలో ఉన్నప్పుడే జీవితాన్ని భిన్నమైన కోణంలో చూస్తాం. ఇక నా ఆరోగ్యం గురించి ఎవరైనా అడిగినప్పుడు ఎంతో కష్టంగా అనిపించేది. ఒక సినిమా కోసం ఏడాది పాటు అడవిలోనే ఉన్న ఆ తర్వాతే అర్థమైంది ప్రకృతి పెద్ద వైద్యం అని అంటూ రానా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: