పుష్ప 2 లో ఇంద్ర !

Seetha Sailaja
ఈసంవత్సరం విడుదలకాబోతున్న టాప్ హీరోల భారీ సినిమాలలో విపరీతమైన అంచనాలు ఉన్న సినిమాల లిస్టులో ‘పుష్ప 2’ ప్రధమ స్థానంలో కొనసాగుతోంది. కేవలం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా సినిమాలు అంటే ఇష్టపడే సగటు ప్రేక్షకుడు కూడ ‘పుష్ప 2’ గురించి ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నాడు.

పుష్పరాజ్ శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడంతో ఈమూవీ పార్ట్ వన్ ముగించిన సుకుమార్ పార్ట్ 2 లో శ్రీవల్లి పుష్పరాజ్ ల మధ్య అనేక ఎమోషనల్ సీన్స్ ను చిత్రీకరించడమే కాకుండా ముఖ్యంగా శ్రీవల్లీ గర్భవతి అయినప్పుడు చిత్రీకరించే శ్రీమంతం సీన్స్ లో బన్నీ అద్భుతంగా నటించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘యానిమల్’ మూవీతో రష్మిక ఇమేజ్ బాలీవుడ్ లో బాగా పెరగడంతో ఆమె నటనకు అవకాశం కలిగించే కొన్ని సన్నివేశాలను ముఖ్యంగా శ్రీవల్లీ చనిపోయే సమయంలో ఆమె నటనతో పాటు బన్నీ యాక్టింగ్ మరో రేంజ్ లో ఉండేలా సుకుమార్ ఈసినిమాకు ఎమోషనల్ టచ్ ఇచ్చినట్లు టాక్.

మరీ ముఖ్యంగా శ్రీవల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను ‘ఇంద్ర’ సినిమాకు తీసుకువెళ్ళడం చిరంజీవి స్క్రీన్ మీద కనిపించగానే బన్నీతో హడావిడి చేయించే సీన్ మెగా అభిమానులకు కూడ బాగా కనెక్ట్ అయ్యేలా సుకుమార్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ లో బన్నీతో మదర్ సెంటిమెంట్ సీన్స్ చేయిస్తే ‘పుష్ప 2’ లో వచ్చీ వైఫ్ సెంటిమెంట్ సీన్స్  ఈమూవీకి కీలకం కాబోతున్నాయి అన్న లీకులు వస్తున్నాయి.

ఆగస్ట్ 15 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఉండేందుకు పుష్ప టీమ్ చాల కష్టపడుతోంది. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన కీలకమైన సీన్స్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత ఈమూవీ రీ రికార్డింగ్ పనులకు తనకు నెలరోజులు సమయం కావాలి అని దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ ను అడిగినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీ క్వాలిటీ విషయంలో సుకుమార్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్థం అవుతుంది..మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: