14 ఏళ్ల తర్వాత మళ్లీ మొదలు పెట్టిన సమంత..!

shami
ఏ మాయ చేసావే సినిమా నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన ఖుషి వరకు సమంత తన 14 ఏళ్ల కెరీర్ లో ఎన్నో రకరకాల పాత్రల్లో మెప్పించింది. నాగ చైతన్య తో మొదటి సినిమాతోనే రొమాంటిక్ ఇమేజ్ తెచ్చుకున్న సమంత ఆ తర్వాత అభినయం ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ వచ్చింది. ఓ పక్క స్టార్ హీరోల సరసన నటిస్తూ మరో పక్క యువ హీరోల తో కూడా జత కట్టింది సమంత. ఇక తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ నాగ చైతన్య తో లవ్ ఆ తర్వాత మ్యారేజ్. అయితే అది రెండేళ్లలోనే ముగిసిందని తెలిసిందే.
ఆఫ్టర్ డైవర్స్ సమంత డిప్రెషన్ లోకి వెళ్లగా అదే టైం లో ఆమె మయోసైటిస్ వ్యాధి తో బాధపడింది. ఫైనల్ గా వాటినన్నటినీ దాటి మళ్లీ మునుపటిలా తయారవుతుంది సమంత. ఈమధ్యనే మలేషియాలో తను షేర్ చేసిన బికినీ ఫోటో షూట్ చూస్తే సమంత ఈజ్ బ్యాక్ అని తెలుస్తుంది. 14 ఏళ్ల ముందు ఆమె ఎవరో తెలియకుండా సమంత ప్రేమలో పడ్డారు. ఆమె మాయలోనే ఇన్నాళ్లు ఉన్నారు.
ఇక ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత మెళ్లా తన కెరీర్ ని ఫ్రెష్ గా మొదలు పెట్టాలని చూస్తుంది సమంత. మరి ఇప్పుడు ఆమెను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి. ఇదివరకు మ్యారేజ్ అయిన హీరోయిన్స్ కి అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టాలెంట్ ఉన్న హీరోయిన్ కి పెళ్లైనా సరే ఆమె తో సినిమాలు చేస్తున్నార్. ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సీరీస్ చేసిన సమంత తెలుగులో సినిమాలు చేసేందుకు కథల వేట కొనసాగిస్తుంది. తప్పకుండా సమంత తిరిగి మళ్లీ సూపర్ ఫాం లోకి వస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: