రుహాని ఆన్ ఫైర్.. కిరాక్ ఫోటో షూట్..!

shami
చిలసౌ భామ రుహాని శర్మ ఏం చేసినా సరే అదో ట్రెండింగ్ అవుతుంది. అమ్మడు సినిమాల్లో కన్నా ఎక్కువగా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా చర్చల్లో ఉంటుంది. చిలసౌ, హిట్, సైంధవ్ ఇలా సినిమాలతో అలరిస్తూ వస్తున్న రుహాని శర్మ మరోపక్క ఫోటో షూట్స్ తో పిచ్చెక్కించేస్తుంది. అమ్మడు ఏం చేసినా అదో స్పెషల్ అనిపించేలా ఉంటుంది. రుహాని లేటెస్ట్ స్టిల్స్ ఐతే కుర్రాళ్ల గుండెల్ని గాయం చేసేలా ఉన్నాయని చెప్పొచ్చు.
తన ఎద అందాలను ప్రదర్శిస్తూ అమ్మడు చేసిన ఈ రచ్చ మామూలుగా లేదు. ఫోటో షూట్స్ లో తనని బీట్ చేసే వారు లేరనేలా అమ్మడు రెచ్చిపోతుంది. మామూలుగా ఎవరైనా సినిమాల్లో రెచ్చిపోతారు బయట ఫోటో షూట్స్ లో కాస్త తగ్గిస్తారు. కానీ రుహాని అందుకు రివర్స్ లో చేస్తుంది. బయట రెచ్చిపోతుంది కానీ సినిమాల్లో మంచి పాత్రలు చేస్తుంది. రుహాని ప్లాన్ ఏంటో తెలియదు కానీ అమ్మడు రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాని హీటెక్కించేస్తుంది.
రుహాని శర్మ లేటెస్ట్ ఫోటోస్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. గ్లామర్ విషయంలో తనకున్న హద్ధులను చెరిపేస్తూ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. రుహాని శర్మ ఫోటో షూట్స్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఏర్పడేలా ఉన్నారు. తన పరువాల వలలో ఆడియన్స్ ని చిక్కుకునేలా చేస్తున్న రుహాని శర్మకు సినిమాల్లో ఈ రేంజ్ లో రెచ్చిపోతే తప్పకుండా టాప్ ప్లేస్ ఇచ్చేయడం ఫిక్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అమ్మడు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ లో నటిస్తుంది. రుహాని ఘాటు ఫోటోలను చూసి ఆడియన్స్ అంతా అవాక్కవుతున్నారు. రుహాని చేస్తున్న ఈ ఫోటో షూట్స్ వల్ల అమ్మడికి మరింత మైలేజ్ దక్కుతుందని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్న అమ్మడి గట్స్ చూసి అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: