తమిళ స్టార్ హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న ధనుష్ ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ నటిస్తున్న సినిమా రాయన్.ఈ సినిమాకు చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ధనుష్ కెరీర్ లో ఈ సినిమా 50 వ సినిమా గా తెరకెక్కుతుండగా.. దీనికి ధనుష్ కథను అందించి దర్శకత్వం వహించడం అనేది విశేషం. ఇక ఈ మధ్యనే ఈ సినిమా నుంచి ధనుష్ లుక్ ను కూడా రివీల్ చేయడం జరిగింది. ఇందులో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి కనిపిస్తోంది. ఇక అతని వెనుక, సందీప్ కిషన్ ఇంకా కాళిదాస్ జయరామ్ చేతిలో కత్తులు ఉన్నాయి.ఈ సినిమాలో హింసకు లోటు ఉండదని పోస్టర్ ను చూస్తే అర్ధం అవుతోంది.ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ లుక్ ను కూడా రివీల్ చేశారు. ఈ మూవీలో ధనుష్ సరసన జాతీయ అవార్డు నటి అపర్ణ బాలమురళి నటిస్తోంది. ఆకాశం నీ హద్దురా సినిమాలో అపర్ణ నటనకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే. భూమిగా ఆమె నటన వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక ఆ సినిమా తరువాత అంతటి న్యాచురల్ నటన రాయన్ సినిమాలో కనిపించబోతుందని లుక్ చూస్తుంటేనే అర్ధమవుతుంది.
పోస్టర్ లో ఒక సాధారణ గృహిణిలా అపర్ణ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అపర్ణ మరో జాతీయ అవార్డును అందుకుంటుందో లేదో చూడాలి. ఇదిలా ఉండగా ధనుష్ ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తన 51 వ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ షూటింగ్ కి సంబంధించిన ధనుష్, రష్మిక సీన్స్ లీక్ అయ్యాయని సమాచారం తెలుస్తుంది.ఇక మరో కొలీవుడ్ స్టార్ విశాల్ కూడా హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా మార్క్ యాంటోనీ సినిమా చేశాడు. ఈ సినిమాలో ఎస్ జే సూర్య కూడా కీ రోల్ లో నటించాడు. ఈ సినిమాతో విశాల్ కి చాలా కాలం తరువాత మంచి హిట్టు దక్కింది. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఈ సినిమాని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం విశాల్ రత్నం అనే మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా ఏప్రిల్ 26 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ని నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయనున్నారు. ఇలా ధనుష్, విశాల్ కోలీవుడ్ లో వరుస సినిమాలతో జెట్ స్పీడులో దూసుకుపోతున్నారు.