నా జీవితానికి అసలైన అదృష్టం మాతృత్వాన్ని పొందడమే... శోబిత..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో శోభిత ధూళిపాల ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో నటించి వాటి ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్యూటీ అడవి శేషు హీరో గా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన గూడచారి అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే ప్రస్తుతం ఈమె మంకీ మ్యాన్ అనే ఓ హాలీవుడ్ మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మకు మరింత క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె తల్లి కావడం గురించి ... మాతృత్వ అనుభవం గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శోభిత మాట్లాడుతూ ... తన జీవితానికి అసలైన అర్థం మాతృత్వాన్ని పొందినప్పుడే అని ఈ ఇంటర్వ్యూ లో భాగంగ ఈమె చెప్పుకొచ్చింది.

అలాగే అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అని ... నిజంగా ఆ అనుభూతిని ఎప్పుడు పొందుతానా అని ఏదురు చూస్తున్నాను. అదొక అద్భుతం గా ఫీల్ అవుతున్నాను. అమ్మ అని పిలిపించుకోవడం అనేది ఒక గొప్ప వరం లాంటిది అని .. ఈ యువ నటి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇకపోతే అమ్మ అని పిలిపించుకోవడం గురించి ... మాతృత్వాన్ని గురించి ఇంత గొప్పగా ఈ నటి చెప్పడంతో ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అద్భుతమైన పాజిటివ్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sd

సంబంధిత వార్తలు: