"ఓం భీమ్ భుష్" టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత మూవీ లలో హీరో గా అవకాశాలను దక్కించుకొని అందులో కూడా చాలా సినిమాలతో మంచి సక్సెస్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే కొంత కాలం పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస అపజాయలను ఎదుర్కొన్న ఈ నటుడు ఆఖరుగా సామజవరగమన అనే సినిమాలో హీరో గా నటించాడు.
 

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో శ్రీ విష్ణు తిరిగి మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు "ఓం భీమ్ భూష్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ  కీలక పాత్రలలో కనిపించనుండగా ... శ్రీ హర్ష కొనుగంటి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ టీజర్ ను ఫిబ్రవరి 26 వ తేదీన రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv

సంబంధిత వార్తలు: