గేమ్ చేంజర్ సినిమా నుంచి వీడియో లీక్..!!

Divya
రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న రెండవ చిత్రం గేమ్ చేంజర్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కీలకమైన పాత్రలో హీరోయిన్ అంజలి శ్రీకాంత్ కూడా నటిస్తూ ఉన్నారు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పోస్టర్లతో టైటిల్ గ్లింప్స్, పాటలను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పలు రకాల పోస్టర్లు కూడా లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. గేమ్ చేంజర్ సినిమా ప్రకటించి ఇప్పటికీ మూడేళ్లు అవుతున్న షూటింగ్ జరుగుతూనే ఉంది. మొదటి నుంచి ఈ చిత్రానికి సంబంధించి లీకుల బెడద తప్పడం లేదు.. ఇప్పటికే ఎన్నోసార్లు పలు రకాల వీడియోస్ పోస్టర్లు కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మార్కెట్లో నడిరోడ్డులో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నట్లుగా అందులో రామ్ చరణ్ ఎంట్రీ ఉందన్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాకి హైలైట్ అవుతుందంటూ సమాచారం.. థియేటర్లో ఈ సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన తదుపరి సినిమాలో రామ్ చరణ్ నటించ బోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.. రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: