'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా' సినిమా ఎలా ఉందంటే?

Purushottham Vinay
కమెడియన్లు కూడా హీరోలుగా అలరిస్తున్న నేపథ్యంలో, టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమటం ఇప్పుడు 'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా' అనే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు.తిరుపతి రావు ఇడ్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తరుణ్‌ భాస్కర్‌ గెస్ట్ రోల్ లో మెరిశాడు. వరుణ్ తేజ్, నిఖిల్ లాంటి యువ హీరోలు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం అవడంతో  అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?అభినవ్ హీరోగా చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.



ఇక ఈ 'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా' చాలా సింపుల్ స్టోరీ. ఇది హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎంచుకునే బలమైన స్టోరీ కాదు. అసలు అభినవ్ బలమైన కామెడీతో కూడిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కూడా కాదు. ఒక చిన్న పాయింట్ తీసుకొని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నంలో వచ్చిన కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అని చూస్తే అర్థం అవుతుంది.స్టార్టింగ్ నుంచి కూడా స్టోరీ చాలా లైటర్‌ ఎమోషన్స్ తో, రొటీన్‌ సీన్లతో సాగుతుంది. హీరో ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టాలనుకోవడం, ఫోటో షాప్‌ నేర్చుకోవాలనుకోవడం, అక్కడ హీరోయిన్‌ తో పరిచయం వంటి సీన్స్ అయితే రెగ్యూలర్‌గానే ఉన్నాయి. సినిమా ఫస్టాప్ మొత్తం కూడా ఇలాంటి సీన్స్ తోనే నడుస్తుంది. అయితే ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఈ సినిమా సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.



ఇక సెకండాఫ్ లో మెయిన్ ప్లాట్ ను డీల్ చేసిన విధానం పర్వాలేదు బాగానే మెప్పిస్తుంది.అలాగే మధ్యలో జనరేట్ అయ్యే ఫన్ కూడా నవ్విస్తుంది. కాకపోతే చాలా లాజిక్స్ ని వదిలేశారు. ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఏం జరగబోతోందో అనే ఉత్కంఠ కూడా కలుగుతుంది.. క్లైమాక్స్ దాకా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ రొటీన్ గా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. కానీ అభినవ్ లో అందరికి నచ్చేది తన కామెడీ టైమింగ్.. అది ఈ సినిమాలో మిస్ అవుతాం. అది కనుక సరిగ్గా ఉండుంటే  అభినవ్ హీరోగా ఫస్ట్ సినిమాతోనే లైట్ లోకి వచ్చేసేవాడు. కొత్తగా అంచనాలు పెట్టుకోకుండా టైం పాస్ కి సినిమా చూడాలనుకునేవారికి ఓవరాల్ గా సినిమా అయితే బాగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: