సూపర్: కార్తీకదీపం-2 సీరియల్ మళ్లీ వస్తోంది.. ప్రోమో వైరల్..!!

Divya
తెలుగు బుల్లితెరపై అత్యధికంగా టిఆర్పి రేటింగ్ సంపాదించుకున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ తమకంటూ ఒక ప్రత్యేకమైన కొన్ని పేజీలను కూడా రాసుకుంది. గతంలో కూడా ఎన్నో సీరియల్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని యూత్ ని ఆకట్టుకున్నాయి.. గతంలో మొగలిరేకులు ,చక్రవాకం వంటి సీరియల్ తరహాలో కార్తీకదీపం సీరియల్ కూడా భారీ క్రేజును సంపాదించుకుంది.. ముఖ్యంగా డాక్టర్ బాబు వంటలక్క అనే పేరు సైతం ఎక్కడ చూసినా వినిపిస్తూ ఉండేది. అయితే ఈ సీరియల్ పూర్తయి ఇప్పటికి ఏడాదిన్నర పైనే అవుతున్నది.

డైరెక్టర్ కూడా కార్తీకదీపం-2 కి ప్లాన్ చేస్తున్నానని ఇంకా కథ సెట్ కాలేదని గతంలో తెలియజేశారు. తాజాగా ఇప్పుడు ఈ సీరియల్  సీక్వెల్ కు సంబంధించి ఒక ప్రోమో అయితే మా టీవీ ఇంస్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు. కొత్త వెలుగులతో కార్తీకదీపం సీరియల్ ని తీసుకువస్తున్నట్లు మేకర్స్ సైతం అనౌన్స్మెంట్ చేశారు.. కార్తీకదీపం ఇది నవవసంతం అనే పేరుతో ఈ సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఈ ప్రోమోలో చూపిస్తున్నారు.

కార్తీకదీపం మెయిన్ స్టోరీ లైను తీసుకొని కొత్త నటీనటులతో ఈ కొత్త కథాంశంతో రూపొందిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. సీరియల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సీక్వెల్ కల్చర్ ని కూడా కార్తిక దీపం సీరియల్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రోమో చూసిన ఆడియన్స్ సైతం ఈ సీరియల్ పైన మంచి క్యూరియాసిటీ పెంచేసుకుంటున్నారు.. కొత్తగా వచ్చిన పర్వాలేదు కానీ సీరియల్ లో డాక్టర్ బాబు మౌనిత వంటలక్క మాత్రం కచ్చితంగా ఉండాలని డిమాండ్ ను చేస్తున్నారు. మరి ఈ సీరియల్ కి సంబంధించి పూర్తి సమాచారం మా యూనిట్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ప్రోమో మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: