ఫ్యాన్స్ కోసం వ్యూహాలు మార్చుకుంటున్న మహేష్ !

Seetha Sailaja
సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా తన అభిమాన సంఘాల సభ్యులతో డిన్నర్ చేయడం అదేవిధంగా వార్నీ వ్యక్తిగతంగా కలుసుకోవడం పెద్దగా అలవాటు లేదు. అయితే ‘గుంటూరు కారం’ మూవీ విడుదల ముందు నుంచి మహేష్ తన వ్యూహాలు మార్చుకుంటున్నాడు. తన తల్లి తండ్రి కంటే తన అభిమానులు తనకెంతో ఇష్టం అనీ వారు లేకుంటే తాను లేను అంటూ చాల భావోద్వేగానికి గురి అయ్యాడు.

అయితే మహేష్ ఇంతగా తన అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ ‘గుంటూరు కారం’ మూవీ విషయంలో వచ్చిన డివైడ్ టాక్ ను అతడి వీరాభిమానులు ఆపలేకపోయారు. దీనితో షాక్ అయిన మహేష్ ఈమూవీ ప్రమోషన్ ను ఈమూవీ విడుదల తరువాత పెద్దగా చేయలేదు. త్వరలో రాజమౌళి తీయబోతున్న భారీ మూవీ కోసం మహేష్ తన హెయిర్ స్టైల్ తో పాటు తన బాడీ ఫిజిక్ లో కూడ చాల మార్పులు చేసుకుంటున్నట్లు సమాచారం.

ఈమూవీ షూటింగ్ సమ్మర్ తరువాత మొదలై 2026 సంక్రాంతికి కానీ లేదంటే సమ్మర్ కు కానీ విడుదల అవుతుంది అని అంటున్నారు. దీనితో మహేష్ నుండి మరొక సినిమా విడుదల కావడానికి రెండు సంవత్సరాలు పైగా సమయం పట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు.

దీనితో ఎలర్ట్ అయిన మహేష్ ఈ సమ్మర్ సీజన్ కోసం తాను నటిస్తున్న కొన్ని కూల్ డ్రింక్ యాడ్స్ కు సంబంధించిన షూటింగ్ సమయంలో ఇరు రాష్ట్రాలలోని మహేష్ అభిమాన సంఘాల నుండి కొంతమంది కీలక ప్రతినిధులను రప్పించుకుని వారితో కలిసి డిన్నర్ చేయడమే కాకుండా రాజమౌళితో తాను నటించబోతున్న సినిమా విషయాలను తెలియచేసినట్లు తెలుస్తోంది. మరో రెండు సంవత్సరాల వరకు తన వైపు నుండి సినిమాలు వచ్చే ఆస్కారం లేకపోవడంతో రాబోతున్న రెండు సంవత్సరాలలో తన వైపు నుండి సినిమాలు లేకపోయినా ఆ గ్యాప్ లో తనను గుర్తుంచుకోమని చెపుతూ తన అభిమానులకు జోష్ ను కలిగించబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: