ప్రభాస్ మనస్తత్వం పై షాకింగ్ కథనం !
షూటింగ్ స్పాట్ కు టాప్ హీరోల సన్నిహితులు చుట్టాలు ఎవరు వచ్చినా వారికి సంబంధించిన ఖర్చులు భోజనాలు అన్నీ కూడ టాప్ హీరోలతో సినిమాలు తీసే నిర్మాతలు భరించవలసి వస్తూ ఉండటంతో ఆ నిర్మాతలకు హీరోలకు ఇచ్చే భారీ పారితోషికాలతో పాటు ఈ ఆదానపు ఖర్చులు లక్షలలో ఉంటున్నాయని ఆకథనం సారాంశం. అంతేకాదు టాప్ హీరోలు తాము తమ విలాశవంతమైన సొంత కార్లలో షూటింగ్ స్పాట్ కు వచ్చినప్పుడు తమ డ్రైవర్ల బేటా అంటూ వేలాది రూపాయలు అలాగే తమ వ్యక్తిగత హెయిర్ డ్రెసర్స్ పర్సనల్ మేకప్ మ్యాన్ ల పేరిట కూడ వేలాది రూపాయాలలో తమ నిర్మాతల నుండి బేటాలు వసూలు చేస్తారని ఆకథనంలో కొన్ని విషయాలు బయట పెట్టింది.
అయితే ప్రభాస్ విషయంలో ఇలాంటి అదనపు ఖర్చులు నిర్మాతలకు ఉండవనీ అందువల్లనే అతడు తన అభిమానులకు మాత్రమే కాకుండా తన నిర్మాతలకు కూడ డార్లింగ్ అంటూ ఆకథనంలో పేర్కున్నారు. ప్రభాస్ షూటింగ్ స్పాట్ కు వచ్చినప్పుడు కేవలం అతడికి మాత్రమే కాకుండా సుమారు 20 మందికి సరిపోయే విధంగా పెద్దపెద్ద క్యారేజ్ లు వస్తాయని ఆ క్యారేజ్ లో ఉండే ఫుడ్ ను ప్రభాస్ తాను తినడమే కాకుండా యూనిట్ లో పనిచేసే లైట్ బాయ్ కి కూడ తాను ఏ ఫుడ్ తింటాడో అదే ఫుడ్ అందరికీ అడిగి మరీమరే పెడుతూ ఆనందాన్ని పొందుతాడని వ్రాసిన ఆకథనం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..