టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. తన బాయ్ ఫ్రెండ్, ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఆమె ఏడడుగులు వేయనుంది.గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్టులో ఫిబ్రవరి 21న ఈ ప్రేమ పక్షుల వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించారు రకుల్, జాకీ. ఇద్దరూ కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెళ్లి పత్రికను తీసుకెళ్లి వినాయకుడి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా రకుల్, జాకీ ఆలయంలోకి వెళుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. ఈ సందర్భంగా పింక్ అనార్కలీ డ్రెస్ లో ఎంతో ట్రెడిషినల్ గా కనిపించింది రకుల్. అలాగే సన్ గ్లాసెస్‍లో ఎంతో స్టైలిష్ గా దర్శనమిచ్చింది పెట్టుకున్నారు రకుల్. ఇక ప్యారెట్ గ్రీన్ కుర్తా ధరించి ఆలయానికి వచ్చాడు జాకీ. దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ హోటల్‌లో రకుల్ - జాకీల వివాహం గ్రాండ్‍గా జరగనుంది. 19వ తేదీ నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరగనున్నాయి. 21న రకుల్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు జాకీ. అయితే ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసి సినీ ప్రముఖులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ పెళ్లిని పర్యావరణ హితంగా చేసుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పటాకులు పేల్చకూడదని ఫిక్స్ అయ్యారు. అలాగే పేపర్ వేస్ట్ లేకుండా అతిథులందరికీ కేవలం డిజిటల్ ఇన్విటేషన్ కార్డులను మాత్రమే అందిస్తున్నారు. రకుల్ - జాకీ వివాహ ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. పింక్, బ్లూ కలర్ షేడ్లలో ఫ్లవర్స్ డిజైన్‍తో ఆకర్షణీయంగా ఉంది. అందమైన బీచ్‍లో వీరి వివాహం జరుగుతుందని తెలిపే థీమ్‍తో ఈ డిజిటల్ వెడ్డింగ్ కార్డ్‌ను రూపొందించారు.