సల్లుభాయ్ కోసం అలాంటి పని చేసిన రాంచరణ్....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకరు. ఈయన మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఇలా చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి చరణ్ తన తండ్రి పేరు ప్రఖ్యాతలు పలుకుబడిని ఏమాత్రం ఉపయోగించుకోకుండా తన స్వసక్తితో ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ గతంలో తనకు సినిమా తప్ప మరి ఏమి తెలియదని సినిమానే నాకు తెలిసిన బిజినెస్ అంటూ ఈయన తెలిపారు. ఇతర బిజినెస్లలో నేను చాలా వీక్ అంటూ ఈయన వెల్లడించారు.
  ఇక ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్నటువంటి చరణ్ ఓ సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశారనే విషయం చాలామందికి తెలియదు. ఈయన ఒక స్టార్ హీరో సినిమాకు డబ్బింగ్ చెప్పారట. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ కు బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సల్మాన్ ఖాన్ తో ఎంతో మంచి సన్నిహిత్యం ఉంది. సల్మాన్ ఖాన్ తన తండ్రి చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలాగే సల్మాన్ ఖాన్ నటించినటువంటి సినిమాలో కూడా రామ్ చరణ్ గెస్ట్ పాత్రలో నటించారు.  ఈ క్రమంలోనే రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ సినిమాలలో కనిపించడమే కాకుండా ఆయన నటించిన ఓ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పారని తెలుస్తుంది. మరి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పినటువంటి ఏకైక సినిమా ఏంటి అనే విషయానికి వస్తే సల్మాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో. సినిమా తెలుగులో కూడా డబ్బ్ అయ్యింది. ఈ సినిమాకు తెలుగులో రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పారట.  ఇక ఈ సినిమా హిందీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియదు. అయితే రామ్ చరణ్ తన కెరియర్ లో డబ్బింగ్ చెప్పిన ఏకైక సినిమాగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఇక ఈయన హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఇటీవల కాలంలో నిర్మాతగా మారి పెద్ద ఎత్తున సినిమాలను కూడా నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: