టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో హిట్టు కొట్టాడు. ఈ సినిమా 252 కోట్ల వసూళ్లు రాబట్టి సూపర్ స్టార్ స్టామినా ఏంటో నిరూపించింది. ఈ సినిమా విడుదలయ్యాక.. ఈ మధ్యే జర్మనీ వెళ్లొచ్చారు మహేష్ బాబు. అది కూడా రాజమౌళి సినిమా కోసమే. అక్కడి విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్‌ను మహేష్ బాబు కలిసొచ్చారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనే విషయంపైనా చర్చ బాగానే జరుగుతుంది. పాన్ వరల్డ్ సినిమా కాబట్టి.. అన్ని భాషల్లోనే కాదు.. దేశాల్లోనూ ఒకే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఎస్ ఎస్ రాజమౌళి.ఇప్పటికైతే మహేష్, రాజమౌళి ను SSMB29 అని అంటున్నారు. దీనికిప్పుడు మహ రాజ్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది..
మహేష్ బాబు పేరులోని మొదటి మూడక్షరాలు MAH.. రాజమౌళి పేరులోని మొదటి మూడక్షరాలు raj కలిపి మహ రాజ్ ( MAH RAJ) టైటిల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.గతంలో తన గ్లోబల్ బ్లాక్ బస్టర్ ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా టైటిల్ ఇలాగే పెట్టారు జక్కన్న. రామ్ చరణ్, రామారావు, రాజమౌళి పేర్లలోని మొదటి అక్షరాలతో rrr అనే వర్కింగ్ టైటిల్ పెట్టి.. చివరికి దాన్నే మెయిన్ టైటిల్‌గా ఆయన మార్చారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం అదే చేస్తున్నారు రాజమౌళి. తమ పేర్లలోని మొదటి మూడక్షరాలతో టైటిల్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. మహేష్ సన్నిహితులు మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. మరి చూడాలి జక్కన్న ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ని ఫిక్స్ చేస్తాడో.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. సీనియర్ ప్రొడ్యూసర్ KL నారాయణ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.