చిరంజీవి కథకు హీరోల కొరత !

Seetha Sailaja
ఆమధ్య చిరంజీవి నటించాలి అనుకుని ముచ్చటపడ్డ ఒక కథ సినిమాగా మారే విషయంలో ఆసినిమాకు సంబంధించి మరొక హీరో దొరకక పోవడంతో ఆసినిమా ప్రారంభం కాకుండానే అటక ఎక్కింది అన్న వార్తలు వినిపించాయి. ఇక వివరాలలోకి వెళితే దర్శకుడు నక్కిన త్రినాథ్ రచయిత బెజవాడ ప్రసన్నతో కలిసి తయారుచేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ టచ్ తో ఉన్న సినిమా కథకు చిరంజీవి ఓకె చెప్పినప్పటికీ అతడి కొడుకు పాత్రలో ఎవరు నటిస్తారు అన్న కన్ఫ్యూజన్ రావడంతో ఆసినిమా ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండానే ఆగిపోయింది అన్న గుసగుసలు వినిపించాయి.

ఈమూవీ కథకు సంబంధించిన కొడుకు పాత్రలో యంగ్ హీరో తేజ్ సజ్జా బాగుంటాడు అంటూ నక్కిన త్రినాథ్ చిరంజీవికి సూచన చేస్తే చిరంజీవి మాత్రం జొన్నలగడ్డ సిద్దూ పేరును సూచించాడు అని అంటారు. అయితే కొడుకు పాత్రలో జొన్నల గడ్డ నటించడానికి కొంత సమయం కావాలి అని అదిగినట్లు గాసిప్పులు కూడ వచ్చాయి. ఈ చర్చలు ఇలా కొనసాగుతూ ఉండగానే చిరంజీవి ‘విశ్వంభర’ వైపుకు వెళ్ళిపోయాడు.

ఇప్పుడు నక్కిన త్రినాథ్ ఆగిపోయిన ఆ కథను సినిమాగా తీయాలి అంటే తేజ్ సజ్జా రెడీగా ఉన్నప్పటికీ అతడి రొమాంటిక్ తండ్రిగా నటించడానికి ఏ సినీయర్ హీరో ఆశక్తి కనపరచడం లేదు అని అంటున్నారు. నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ లు సీనియర్ హీరోలే అయినప్పటికీ తండ్రి పాత్రలలో నటించడానికి పెద్దగా ఆశక్తి కనపరచక పోవడంతో ఈసినిమాకు హీరో సమస్య ఏర్పడింది అని అంటున్నారు.

రావ్ రామేష్ ప్రకాష్ రాజ్ లాంటి కేరెక్టర్ ఆర్టిస్టులు రొమాంటిక్ తండ్రిగా నటించడానికి ముందుకు వస్తున్నప్పటికీ అలాంటి కాంబినేషన్ లో తీసిన సినిమాలకు పెద్దగా క్రేజ్ ఉండదని నక్కిన త్రినాథ్ అభిప్రాయం. దీనితో చిరంజీవికి నచ్చిన కథకు హీరోలు దొరకకపోవడం ఏమిటి అంటూ కొందరి కామెంట్స్. ఇలాంటి పరిస్థితులలో ఆటకెక్కిన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సినిమాగా మారుతుందో తెలియని పరిస్థితి అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: