మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నేను శైలజ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఇందులో ఈమె తన అదిరిపోయే రేంజ్ పెర్ఫార్మెన్స్ తో రెచ్చిపోవడంతో ఈ నటికి మహానటి సినిమాతో ఎక్కడలేని క్రేజ్ లభించింది.
దానితో వరుసగా కీర్తి సురేష్ కు తెలుగు , తమిళ సినీ పరిశ్రమల నుండి లేడీ ఓరియంటెడ్ సినిమాల అవకాశాలు భారీగా వచ్చాయి. అందులో భాగంగా ఈమె కూడా ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించింది. కాకపోతే ఇప్పటి వరకు అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కీర్తి నటించినప్పటికీ ఏ సినిమా కూడా మహానటి రేంజ్ విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా సైరన్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో తమిళ , తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు సైడ్ వ్యూలో హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కీర్తి కి సంబంధించిన ఈ హాట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.