ప్రశాంత్ పల్లవికి అలాంటి సలహా ఇచ్చిన నటుడు....!!
హౌస్ లో వీళ్లంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఆడారు.గత సీజన్ల కంటే బిగ్ బాస్ సీజన్ 7 బాగా హైలైట్ అయింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ హౌస్ లో పోరాడిన తీరు అద్భుతం అనే చెప్పాలి. హౌస్ లో వీళ్లంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఆడారు. దీనితో ఫ్యాన్స్ కూడా తమకి ఇష్టమైన గ్రూప్ కి మద్దతు తెలిపారు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ ఒక గ్రూప్ కాగా.. శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక మరో బ్యాచ్ అన్నట్లుగా హౌస్ లో ఫైట్ సాగింది.చివరికి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. సామాన్యుడు, రైతు బిడ్డ అనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అదే విధంగా శివాజీ అతడికి సహకారం అందించారు. అయితే హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడో తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే మరోసారి బిగ్ బాస్ 7 టీం మొత్తం కలుసుకున్నారు. బిగ్ బాస్ ఉత్సవ్ షోలో భాగంగా వీరంతా మళ్ళీ ఒక్క వేదికపై మెరిశారు. బిబి ఉత్సవ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. త్వరలో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కూడానా కాబోతోంది. ఈ షోలో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలతో తన కుటుంబం ఎంతలా నరకం అనుభవించిందో చెప్పబోతున్నాడు.ఇదిలా ఉంటే షూటింగ్ గ్యాప్ లో పల్లవి ప్రశాంత్.. గౌతమ్.. శివాజీ ఫన్నీగా ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుకున్న మాటలు వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ ని ఉద్దేశిస్తూ శివాజీ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా పల్లవి ప్రశాంత్ ని ఇక రాజకీయాల్లోకి వెళ్ళమని సలహా ఇచ్చాడు.ప్రశాంత్ ని శివాజీ ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. ఏం రా ప్రశాంత్.. నువ్వు పెద్ద ఎమ్మెల్యే అయిపోయావురా.. నిన్ను కలవడమే కష్టం అయిపోతోంది. ఇంతకీ ఏ పార్టీ.. కాంగ్రెస్సా బిఆర్ఎస్సా అని శివాజీ ఫన్నీగా అడిగాడు. ఏదో ఒక పార్టీలో త్వరగా జాయిన్ అయిపో.. లేదంటే సొంతంగా పార్టీ పెట్టు అని సలహా ఇచ్చాడు.దీనితో నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచినందుకే రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యే అయిపోతాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు.