ట్యాగ్ లైన్ అన్వేషణలో రాజమౌళి !

Seetha Sailaja
మహేష్ బాబుతో రాజమౌళి తీయబోతున్న మూవీ కథ ఫైనల్ కావడంతో ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం అయినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఈ సినిమాలో నటించవలసి ఉన్న నటీనటుల ఎంపిక కొనసాగిస్తూనే ఈసినిమాకు సంబంధించిన డైలాగ్స్ వెర్షన్ అదేవిధంగా ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ కీరవాణి ఆద్వర్యంలో జరుగుతున్నట్లు టాక్.

ఈమూవీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించి ఒక క్యాచింగ్ ట్యాగ్ లైన్ అన్వేషణలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ విడుదల అయిన తరువాత ‘బాహుబలి 2’ విడుదలకు చాల సమయం పట్టినప్పటికీ కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అన్న ట్యాగ్ లైన్ విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం పొందడంతో ఆ ట్యాగ్ లైన్ జనంలోకి విపరీతంగా వెళ్ళిపోయింది.

అదేవిధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ మొదలుపెట్టినప్పుడు ఆమూవీకి మొదట్లో టైటిల్ ఎలా పెట్టాలి అన్న ఆలోచనలలో రాజమౌళి ఉన్నప్పుడు రాజమౌళి రామ్ చరణ్ రామారావు పేర్లు కలిసి వచ్చేలా ‘ఆర్ ఆర్ ఆర్’ అన్న ట్యాగ్ లైన్ సోషల్ మీడియాలో ఆమూవీ షూటింగ్ ప్రారంభం నుండి విపరీతంగా పాపులర్ అయింది. చివరకు ఆ పాపులారిటీ తార స్థాయికి చేరుకోవడంతో అదే ట్యాగ్ లైన్ ను మూవీ టైటిల్ గా మార్చేశాడు రాజమౌళి.

ఇప్పుడు ఇదే పద్ధతిని అనుసరిస్తూ మహేష్ రాజమౌళిల పేర్లు కలిసి వచ్చేలా త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీకి కూడ ఏదైనా క్యాచింగ్ ట్యాగ్ లైన్ ఈమూవీ షూటింగ్ ప్రారంభం నుండి ప్రచారంలోకి తీసుకు వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలతో జక్కన్న తన టీమ్ తో మేధోమధనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమూవీలో హీరోయిన్ గా మహేష్ పక్కన్న దీపికా పదుకొనె ఎంతవరకు బాగుంటుంది లేదంటే మరో బాలీవుడ్ బ్యూటీ మహేష్ పక్కన ఎవర్ని పెట్టాలి అన్న విషయమై కూడ రాజమౌళి ఆలోచనలు కొనసాగుతున్నట్లు టాక్..    


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: