వరుణ్ తేజ్ కి షాక్ ఇవ్వబోతున్న వెన్నెల కిషోర్ !

Seetha Sailaja

ప్రస్తుతం తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో వెన్నెల కిషోర్ హవా నడుస్తోంది. టాప్ హీరోల సినిమాల నుండి మీడియం రేంజ్ సినిమాల వరకు ఇలా అన్ని సినిమాలలోను ఇతడి ఆధిపత్యం కనిపిస్తోంది. గతంలో బ్రహ్మానందం హవా లా ప్రస్తుతం ఇతడి హవా కొనసాగుతోంది. డైలాగ్ డెలివారీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒరవడి అతడి సొంతం.

ఇప్పటికే అనేక సినిమాల విజయానికి తనవంతు పాత్ర పోషించిన ఈ విలక్షణ హాస్యనటుడు హీరోగా ‘చారి 111’ అన్న సినిమా త్వరలో రాబోతోంది. ఆమధ్య ఈ సినిమాకు సంబంధించిన ఒక యానిమేటెడ్ వీడియోతో వెన్నెల కిషోర్ తన పాత్రకు ఇంట్రో ఇస్తూ సినిమాను అనౌన్స్ చేసిన తీరు సోషల్ మీడిఆలో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో  ఇతడు తాను కన్ఫ్యూజ్ అవుతూ అందర్నీ కన్ఫ్యూజ్ చేసే పాత్ర అని తెలుస్తోంది.

ఎటువంటి హడావిడి లేకుండా ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఈ మూవీని మార్చి 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే మార్చి 1న వరుణ్ తేజ్ నటించిన ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్’ విడుదల కాబోతోంది. ప్రస్తుతం వరస ఫ్లాప్ లతో శతమతమైపోతున్న వరుణ్ తేజ్ కు ఒక హిట్ కావాలి.

అయితే ఇప్పుడు ఈ సినిమాను టార్గెట్ చేస్తూ వెన్నెల కిషోర్ తన ‘చారి 111’ ను పోటీకి దింపడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దీనితో వరుణ్ తేజ్ కు వెన్నెల కిషోర్ ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడా అంటూ అప్పయాఉదే కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈమధ్య కాలంలో వరుణ్ తేజ్ సినిమాలకు ఓపెనింగ్ కలక్షన్స్ కూడ అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీనితో అతడి మార్కెట్ ఆశించిన స్థాయిలో లేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో వెన్నెల కిషోర్ పోటీని తట్టుకుని ఈ మెగా ప్రిన్స్ ఎలా నిలబడతాడో చూడాలి..  


.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: