పూజాని మిస్ అవుతున్న తెలుగు ఫ్యాన్స్..!

shami
బుట్ట బొమ్మ పూజా హెగ్దేకి తెలుగు లో ఒక్క ఆఫర్ కూడా రావట్లేదు. మేకర్స్ వద్దనుకుంటున్నారా లేదా అమ్మడే తెలుగు సినిమాలు చేయట్లేదా అన్నది తెలియదు కానీ పూజా హెగ్దే గుంటూరు కారం ఛాన్స్ మిస్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ తెలుగు సినిమా ఛాన్స్ అందుకోలేదు. తెలుగులో రవితేజ, నాని లాంటి హీరోల సినిమాల్లో నటిస్తుందని వార్తలు వచ్చినా వాటిల్లో కూడా నిజం లేదని తెలుస్తుంది.
తెలుగు దర్శక నిర్మాతలేమో కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం పూజాని బాగా మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. నిన్న మొన్నటిదాకా స్టార్ హీరోలకు ఆమె మొదటి ఆప్షన్ కాగా ఇప్పుడు పూజా పేరు కూడా వినిపించట్లేదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీనికి కారణాలు ఏవైనా కూడా పూజా హెగ్దే తిరిగి తెలుగులో వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ ఇక్కడ ఒక్క ఛాన్స్ కూడా రావట్లేదు.
వచ్చిన ఒకటి రెండు అవకాశాలను కూడా పూజా భారీ రెమ్యునరేషన్ అడిగి కాదనేస్తుందని తెలుస్తుంది. పూజా సినిమాలో ఉంటే గ్లామర్ విషయం లో డౌట్లు అక్కర్లేకుండా కవర్ చేస్తుంది. ముఖ్యంగా పూజా థై షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓ పక్క మిగతా హీరోయిన్స్ అంతా కూడా ఓ రేంజ్ ఫాం కొనసాగిస్తుండగా పూజా కి మాత్రం లక్ కలిసి రావట్లేదు. పూజా కం బ్యాక్ ఇస్తే ఆమె తెలుగు ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ అన్నట్టే లెక్క. ప్రస్తుతం స్టార్స్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. పూజా ట్రై చేసినా వేస్ట్ అందుకే టైర్ 2 హీరోలతో అయినా ఆమె ఓకే అనుకుంటే మాత్రం ఛాన్స్ వస్తాయి. అయితే పూజా క్రేజ్ ని వాడుకోవాలనుకునే వారు తప్పకుండా ఆమె వైపు ఒక కన్ను వేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: