మరోసారి ఆ దర్శకుడితో నిఖిల్ సినిమా... నిర్మాత ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ హీరోలలో నిఖిల్ ఒకరు  ఈయన ఆఖరుగా గర్రీ బిహెచ్ దర్శకత్వంలో "స్పై" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం నిఖిల్ "స్వయంభు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఈయన ఇండియా గేట్ అనే సినిమాలో కూడా హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఇకపోతే ఇప్పటికే ఒక సినిమాలో నటిస్తూ మరో సినిమాను రెడీగా ఉంచుకున్న నిఖిల్ తాజాగా మరో క్రేజీ దర్శకుడితో ... ఓ క్రేజీ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... గతంలో నిఖిల్ , వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో హీరో గా నటించి సూపర్ సక్సెస్ ను అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మరోసారి నిఖిల్ , ఆనంద్ కాంబోలో మరో మూవీ రూపొందబోతున్నట్లు ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా వి ఐ ఆనంద్ ఊరు పేరు భైరవకోన సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 16 వ తేదీన విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: