భైరవ కోనను టార్గెట్ చేస్తున్న లవ్ పిక్చర్స్ !

Seetha Sailaja
సాధారణంగా ఒక టాప్ హీరో సినిమాను టార్గెట్ చేస్తూ మరో టాప్ హీరో సినిమా విడుదల అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక మీడియం రేంజ్ సినిమాను టార్గెట్ చేస్తూ మరో మీడియం రేంజ్ సినిమా విడుదల అవ్వడం సర్వసాధారణం. అయితే ఎవరు ఊహించని విధంగా ఈవారం విడుదల కాబోతున్న ‘ఊరి పేరు భైరవ కోన’ మూవీని టార్గెట్ చేస్తూ ఏకంగా 10 పాత సినిమాలు ఒకేసారి రీ రిలీజ్ అవ్వడం షాకింగ్ గా మారింది.

గత కొంతకాలంగా ఒకప్పటి టాప్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారింది. ఇలా రీ రిలీజ్ అయిన కొన్ని టాప్ హీరోల సినిమాలు కలక్షన్స్ విషయంలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీనికితోడు టాప్ హీరోల అభిమానులు తమ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ అయినప్పుడు విపరీతంగా చూస్తూ తమ హీరోల పట్ల తమకున్న వీరాభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా జరగబోతున్న ప్రేమికుల దినోత్సవం ‘వాలెంటన్స్ డే’ సందర్భంగా గత కొన్ని సంవత్సరాల క్రితం రిలీజ్ అయి కలక్షన్స్ విషయంలో చరిత్ర సృష్టించిన 10 బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకేసారి విడుదల అవుతూ ఉండటంతో ఈవారం ధియేటర్లు అన్నీ పాత సినిమాలతో నిండిపోతున్నాయి. ఈ లిస్టులో ప్రధమ స్థానంలో పవన్ కళ్యాణ్ ఒకనాటి బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలిప్రేమ’ తో పాటు హాలీవుడ్ సంచలనం ‘టైటానిక్’ కాకుండా ‘సీతారామం’ ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’  ‘ఓయ్’ సినిమాలతో పాటుగా మరికొన్ని బాలీవుడ్ బ్లాక్ బష్టర్ లవ్ స్టోరీ మూవీలు కూడ విడుదల అవుతున్నాయి.

అయితే ఇన్ని రీ రిలీజ్ సినిమాల మధ్య ఒకేఒక్క చిన్న సినిమాగా విడుదల అవుతున్న సందీప్ కిషన్ ‘ఊరి పేరు భైరవకోన’ ఎంతవరకు ఈపాత సినిమాల పోటీని తట్టుకుని నిలబడగలుగుతుంది అన్నసందేహం చాలమందిలో ఉంది. పాత సినిమాల తాకిడితో ‘ఊరి పేరు భైరవ కోన’ ఏమౌతుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: