రజనీకాంత్ ను వెంటాడుతున్న చిరంజీవి అనుభవాలు !

Seetha Sailaja
క్రితం సంవత్సరం విడుదలైన ‘జైలర్’ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వాడమే కాకుండా ఆమూవీకి ఏకంగా 600 కోట్లకు పైగా కలక్షన్స్ రావడంతో రజినీకాంత్ మ్యానియా తిరిగి దక్షిణాది రాష్ట్రాలలో ఏర్పడింది. ఈ క్రేజ్ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తో చేసిన ‘లాల్ సలామ్’ భయకరమైన ఫ్లాప్ గా మారడంతో రజనీ అభిమానులు షాక్ కు గురిఅయ్యారు.

తెలుగు రాష్ట్రాలలోనే కాదు రజనీకాంత్ ను విపరీతంగా ఆరాధించే తమిళనాడులో కూడ ఈమూవీకి మొదటిరోజు మార్నింగ్ షో నుండి పూర్తి నెగిటివ్ టాక్ రావడంతో ఐశ్వర్య చేసిన ప్రయోగంలో రజనీకాంత్ అనవసరంగా కార్నర్ అయ్యాడు అంటూ అతడి అభిమానులు భావిస్తున్నారు. గత సంవత్సరం సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ సక్సస్ తో జోష్ లోకి వెళ్ళిపోయిన చిరంజీవికి   ఆ  తరు వాత  నటించిన   భోలా శంకర్   ఫెయిల్  అవ్వడం తో ఆ షాక్ నుండి కొలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది అని అంటారు.

 దీనితో కళ్యాణ్ కృష్ణతో తాను చేయవలసిన  మూవీని పక్కకు పెట్టి ‘విశ్వంభర’ వైపు వెళ్ళిపోయాడు. లేటెస్ట్ గా రజనీకాంత్ కు కూడ ఇదే పరిస్థితి ఎదురైంద అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గత శుక్రువారం విడుదలైన ‘లాల్ సలామ్’ మూవీని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు తమిళ ప్రేక్షకులు కూడ పట్టించుకోకపోవడం షాకింగ్ గా మారింది.

రజనీకాంత్ అభిమానులు అయితే ఈసినిమాను చూసి తమ హీరోకి అతడి కూతరు ఐశ్వర్య పై ప్రేమ ఉంటే ఫర్వాలేదు కాని తన కూతురు కోసం ఇలాంటి అర్థంలేని చెత్త సినిమాలలో నటించడం ఏమిటి అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి ‘భోళా శంకర్’ అనుభవాలు రజనీకాంత్ ‘లాల్ సలామ్’ లో గుర్తించలేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో రజనీకాంత్ కు చిరంజీవికి ఒకే రకం సమస్యలు వచ్చాయి అంటూ మరికొందరు జోక్ చేస్తూ సినిమా కథ బాగుండకపోతే చిరంజీవి రజనీకాంత్ ల సినిమాలకు కూడ మినహాయింపు ఉండదా అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: