ప్రభాస్ 'మిర్చి' సినిమా కాన్సెప్ట్ నే.. కొరటాల ఎన్టీఆర్ 'దేవర'కి కూడా వాడేస్తున్నాడట?

praveen
మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఎంతలా పాపులారిటీ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత.. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకక్కుతూ ఉంది అని చెప్పాలి. అయితే గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

 ఈ క్రమంలోనే ఈ హిట్ కాంబినేషన్ పై ప్రస్తుతం అభిమానులందరిలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయ్ అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాకి ముందు ఆచార్య అనే ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు కొరటాల శివ. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో దేవర విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎలాంటి కాన్సెప్ట్ తో అటు ఎన్టీఆర్ దేవర సినిమాను తెరకెక్కించబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ మాస్ రోల్ లో ఎన్టీఆర్ ని కొరటాల చూపించబోతున్నాడు అన్న విషయం ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో అర్థమయింది.

 అయితే ఎన్టీఆర్ దేవర సినిమా విషయంలో అటు కొరటాల శివ ప్రభాస్ మిర్చి సినిమా కాన్సెప్ట్ నే వాడేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. మిర్చి సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ సీన్స్ గా సినిమాలో మెయిన్ థిమ్ గా ఉంటాయి. అయితే సొంతూరు కి వచ్చి తండ్రి కోసం పోరాటం చేసే కొడుకు హీరోఇజం చూపించి ఆకట్టుకున్నాడు కొరకల శివ.  ఇప్పుడు దేవరకు కూడా మిర్చికి మించిన తండ్రి కొడుకుల సెంటిమెంట్ హీరో ఎలివేషన్ సీన్స్ ఉంటాయట. ఇక ఈ సినిమా కొరటాల శివ కెరియర్ లోనే బెస్ట్ మూవీ గా నిలిచిపోయే అవకాశం ఉందని కొంతమంది సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: