"ఈగల్" మూవీకి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ హీరో గా అనుపమ పరమేశ్వరన్ కావ్య దాపరర్ హీరోయిన్ లుగా రూపొందిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఈ మూవీ కి 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజం ఏరియాలో 2.70 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.08 కోట్లు ... ఉత్త రాంధ్రలో 84 లక్షలు , ఈస్ట్ లో 55 లక్షలు , వెస్ట్ లో 34 లక్షలు , గుంటూరు లో 65 లక్షలు , కృష్ణ లో 36 లక్షలు , నెల్లూరు లో 28 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ పూర్తి అయ్యే సరికి ఈగల్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.89 కోట్ల షేర్ ... 12.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ సినిమాకి 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 60 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 95 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకి 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 8.35 కోట్ల షేర్ ... 15.25 కోట్ల క్లాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 13.65 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబటినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: