కెరియర్ తొలినాళ్లలో.. నేను సెక్సీగా లేనని కామెంట్ చేశారు : మృణాల్

praveen
సాధారణంగా ఇండస్ట్రీలోకి నటులుగా ఎంట్రీ ఇచ్చినవారు సక్సెస్ అయిన తర్వాత వారి లైఫ్ ఎంతో లగ్జరీగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇది చూసి లైఫ్ అంటే సినిమా వాళ్ళదే. ఇక ఎప్పటికప్పుడు నచ్చిన కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇక కొత్త కొత్త సినిమాలో నటిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు అని ఇక ప్రేక్షకులు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక ఇలా తెరమీద ఎంతో అందంగా కనిపించే సినీ సెలబ్రిటీలు సైతం కెరియర్ తొలినాళ్లలో ఊహించని రీతిలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే అందరూ సినీ సెలబ్రిటీలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఈ విషయాలన్నీ కూడా ఒకప్పుడు పెద్దగా బయటకు రాణించేవారు కాదు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు కెరియర్ తొలినాళ్లలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉండటం నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే తమను కెరియర్ తొలిలినాళ్ళల్లో బాడీ షేమింగ్ చేసేవారు అంటూ పలు సంచలన విషయాలను ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు బయటపెట్టారు. ప్రస్తుతం అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోయిన్లలో ఒక్కరుగా కొనసాగుతున్న మృణాల్ ఠాగూర్ కి సైతం ఇలాంటి చేదు అనుభవం ఎదురయిందట.

 ఈ క్రమంలోనే ఇటీవల సంచలన విషయాలను చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. తాను కూడా కెరియర్ తొలినాళ్లల్లో బాడీ షేమింగ్ కి గురయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ చిత్రాలలో నటించేందుకు ఎంతగానో ఇబ్బంది పడ్డాను. మరొకరితో పోలుస్తూ నా నటనను కించపరుస్తూ ఉండేవారు. ఓ సాంగ్ షూటింగ్ సమయంలో బరువు తగ్గాలని సలహా ఇచ్చారు. కానీ నేను తగ్గను అని ఘాటుగా రిప్లై ఇచ్చాను. అయితే ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన్న సమయంలో నేను సెక్సీగా లేనని ఒక ఫోటోగ్రాఫర్ కామెంట్ చేశాడు. ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు అంటూ ఇన్సల్ట్ చేశాడు అంటే మృణాల్ ఠాగూర్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: