'లాల్ సలామ్'.. రజినీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Anilkumar
సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన తాజా చిత్రం 'లాల్ సలామ్'. క్రికెట్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో30 నుంచి 40 నిమిషాల స్క్రీన్ స్పేస్ ఉండే పాత్రలో పోషిస్తున్నారు. కనిపించేది చాలా తక్కువ సమయం అయినా.. రజనీకాంత్ ఇందుకోసం ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అంటే నిమిషానికి కోటిన్నర అన్నమాట. గెస్ట్ రోల్ కోసం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న హీరో రజనీకాంత్ మాత్రమే అని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో గెస్ట్ రోల్ కోసం

 ఈ రేంజ్ రెమ్యునరేషన్ మరే హీరో తీసుకోలేదు. ఇక ఈ సినిమా ఆడియో లాంచ్ ఇటీవలే జరిగింది. ఇందులో దర్శకురాలు ఐశ్వర్య సినిమా కాన్సెప్ట్ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఒక గ్రామంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన సమస్యని క్రికెట్ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించే ముస్లిం పెద్దమనిషిగా రజనీకాంత్ కనిపిస్తారు. సెకండ్ హాఫ్‌లో ఎంట్రీ ఉంటుందని టాక్. సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో నటించారు. జైలర్ తర్వాత రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడంతో 'లాల్ సలామ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో సూపర్ స్టార్ కి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా మేకర్స్

 వెనుకాడలేదని అంటున్నారు. లాల్ సలామ్ కోసం రజినీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగనుండటంతో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ గెస్ట్ రోల్లో చేశారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ చిత్రాన్ని నిర్మించారు. రెడ్ గైయింట్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించారు. ఆస్కార్ విన్నర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. మొదట ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పలు అనివార్య కారణాలవల్ల రిలీజ్ చేయలేకపోయారు. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: