అల్లు అర్జున్ తో సినిమానా.. నేనేంటి నా రేంజ్ ఏంటీ : ఎస్కేఎన్

praveen
ఇటీవల కాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్న ట్రెండు కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవుతున్న మూవీస్ ఏకంగా నిర్మాతలకు లాభాల పంట పండిస్తూ ఉన్నాయి. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీస్ ఏకంగా వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే గతంలో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ విజయం సాధించిన మూవీ బేబీ. ఏకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఇక యూత్ అందరిని కూడా తెగ ఆకట్టుకుంది అని చెప్పాలి.

 విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ మూవీ భారీగా వసూళ్లను సాధించింది. దీంతో ఈ సినిమా ద్వారా అటు నిర్మాతగా వ్యవహరించిన ఎస్కేఎన్ భారీగానే లాభాలను వెనకేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఇదే కాన్సెప్ట్ ని అటు ఇతర భాషల్లో కూడా రీమేక్ చేసే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయంపై అటు నిర్మాత మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఎస్కేఎన్ నిర్మాణంలో ఇప్పుడు ట్రూ లవర్ అనే మరో సినిమా రాబోతుంది.

 ఈ మూవీ కూడా బేబీ తరహా లోనే ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. కాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత ఎస్కేఎన్. బేబీ సినిమాకి ట్రూ లవర్ మూవీకి ఎలాంటి పోలిక లేదు అంటూ చెప్పుకొచ్చాడు. రెండు బిబిన్నమైన కథలను చెప్పుకోవచ్చు. బేబీ హిందీ రీమేక్ ను త్వరలో ప్రకటిస్తాము అంటూ మరో గుడ్ న్యూస్ ని కూడా చెప్పాడు. సాయి రాజేష్ ఆ మూవీ ని డైరెక్ట్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే బేబీ హిందీ రీమేక్ లో స్టార్ కిడ్స్ లేదంటే కొత్త వాళ్ళతో చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. అల్లు అర్జున్తో ఎప్పుడు సినిమా తీస్తారు అంటూ ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను నిర్మాతగా అప్పర్ ప్రైమరీ స్థానంలో ఉన్నానని.. కాలేజీ స్థాయికి వచ్చాక అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ఎస్కేఎన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: