మెగాస్టార్ చేసిన ఆ స్టెప్పు.. ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు?

praveen
మెగాస్టార్ చిరంజీవి.. ఈయన కేవలం అందరిలా ఒక స్టార్ హీరో మాత్రమే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక మూలస్థానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్టార్ హీరోగా కంటే ఒక మహా వృక్షం లాగా ఆయన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. మెగా అనే ఫ్యామిలీని స్థాపించి ఇక తన ఫ్యామిలీలోని ఎంతోమంది యువకులను ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేశాడు. అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన శివశంకర వరప్రసాద్ అటు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చిరంజీవిగా మారడానికి పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించలేం.

 తనలాగా మరొకరు డ్యాన్సులు చేయలేరేమో అన్నట్లుగా చేసి చూపించి ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్ధులను  చేశాడు  ఏకంగా చిరంజీవి బాడీలో స్ప్రింగ్లు ఏమైనా పెట్టుకున్నాడా ఏంటి అని ఇతర హీరోలు అందరూ కూడా అనుకునే విధంగా ఇక మెగాస్టార్ తన డాన్సులతో సరికొత్త ట్రెండ్ సృష్టించారు అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో డాన్స్ లకు కమర్షియాలిటీని తీసుకువచ్చింది మెగాస్టారే అనడంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు 60 ప్లస్ వయసులో కూడా అదే గ్రేస్ అదే ఊపు అదే ఉత్సాహంతో డాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

 అయితే నేటి తరంలో డాన్సుల్లో బాగా రాణిస్తున్న హీరోలు చాలామంది ఉన్న హీరోయిన్లలో మాత్రం సాయి పల్లవి బెస్ట్ డాన్సర్ అని చెప్పాలి. అయితే గతంలో చిరంజీవి డాన్సులపై కామెంట్ చేసింది సాయి పల్లవి. మెగాస్టార్ డాన్సుల్లో ఉండే గ్రేస్ ఎవరికి సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చింది. ఆయనలా చేయాలని చాలా ప్రయత్నించిన సాధ్యం కాలేదు అంటూ తెలిపింది సాయి పల్లవి. ఆయన చేసిన మూమెంట్స్ తనకు రాలేదని చెప్పుకొచ్చింది. ముఠామేస్త్రి సినిమాలోని మార్కెట్లో వచ్చే టైటిల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ పాటలోని మూమెంట్స్ ని చాలాసార్లు ట్రై చేశాను. తనకు మాత్రం రాలేదు. ఈ తాను ఏం చేసినా ఆడపిల్లనే అని.. అది మగవాళ్ళు చేసే రిథమ్  అని.. అది చిరంజీవికే మాత్రమే సాధ్యమైంది అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: