ఆ క్రేజీ దర్శకుడితో సినిమా చర్చలు జరుపుతున్న బెల్లంకొండ శ్రీనివాస్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటనలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన అల్లుడు శీను అనే మూవీ తో నటుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... వి వి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఇందులో సాయి శ్రీనివాస్ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఈయనకు తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది.


ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన చత్రపతి అనే హిందీ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి చత్రపతి  సినిమాకు రిమేక్ గా రూపొందింది. మంచి అంచనాల నడుమ హిందీ లో విడుదల అయిన చత్రపతి మూవీ బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి విజయాన్ని అందించలేక పోయింది. ఇకపోతే ఈ నటుడి నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నటుడు ప్రస్తుతం విజయ్ కనకమెడల అనే దర్శకుడితో నెక్స్ట్ మూవీ కి సంబంధించిన కథ చర్చలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.


అన్ని కుదిరితే వీరి కాంబోలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ కనకమెడల , అల్లరి నరేష్ హీరో గా రూపొందిన నాంది మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలోనే ఉగ్రం అనే మరో మూవీ రూపొందింది. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: