ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించేలా 'రాజధాని ఫైల్స్' ట్రైలర్

Anilkumar
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశాన్ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. రాజధానుల కోసం రైతుల భూములను లాక్కోవడం, వాటికోసం రైతులు పోరాడడం.. లాంటి సంఘటనలు ఏపీ రాజకీయాల్లో ఎంతటి సంచలనమయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అంశాలను ప్రధానంగా తీసుకొని 'రాజధాని ఫైల్స్' అనే సినిమాని తెరకెక్కించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాజధాని ప్రాంతంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందింది. భాను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవిశంకర్ నిర్మాత. అఖిలన్‌, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు. 

ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక  చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో మూడు రాజధానుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి పాల్పడ్డ మోసాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. అయితే ఇక్కడ అమరావతి పేరుని అయిరావతిగా, ఆంధ్రప్రదేశ్ పేరుని అరుణప్రదేశ్ గా మార్పు చేసి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు చిత్ర యూనిట్. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపించారు అమరావతిలో పరదాలు చాటున ముఖ్యమంత్రి చేసిన పర్యటనలు, రాజధాని ప్రాంత ప్రజల పై ప్రభుత్వం అనుసరించిన తీరు అంతా ఈ సినిమాలో

 ఉండబోతోందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది వైసీపీ అధికారిక భాష నుంచి గుడివాడ క్యాసినో వరకు వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను ట్రైలర్ లో చూపించారు. 'కష్టపడమని చెప్తే.. ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి', 'ప్రజలెప్పుడూ మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి’ అంటూ ప్రజల గురించి ఎంతో నీచంగా ఆలోచించే ముఖ్యమంత్రి, '140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా, 'ఏడాది కాకపోతే.. నాలుగేళ్ళకైనా చదును చేస్తాం.. పంటలు పండిస్తాం.. రైతులంరా..', 'మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. మహా పాదయాత్ర' అంటూ ఆ ముఖ్యమంత్రిని ఎదిరించాలని, ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పి తమ హక్కుల్ని కాపాడుకోవాలని పోరాటం చేసే ప్రజలు.. ఇలా ఎన్నో అంశాలను  ఎంతో ఆసక్తికరంగా చూపించి సినిమాపై ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెంచారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: