ఏంటీ.. హనుమాన్ కోసం.. తేజ 75 సినిమాలు వదులుకున్నాడా?

praveen
కొన్ని కొన్ని సార్లు చిన్న సినిమాలుగా వచ్చిన మూవీస్ ఏకంగా భారీ విజయాలను సొంతం చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఇలాంటిది ఎక్కువసార్లు రిపీట్ అవుతూ వస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధిస్తున్నాయ్. అదే సమయంలో భారీ బడ్జెట్ మూవీలు చివరికి ఫ్లాప్ గా మిగిలిపోతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల హనుమాన్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. తేజ సజ్జా లాంటి ఒక చిన్న హీరో ఇందులో ప్రధాన పాత్రలో నటించగా ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

 స్టార్ హీరోలు అందరూ బరిలోకి దిగిన సంక్రాంతి బరిలోనే ఇక ఈ మూవీ కూడా విడుదలకు సిద్ధమైంది. అయితే స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కినట్టు బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకవైపు తేజ సజ్జకి మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి కూడా ఊహించని రీతిలో క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పటికీ కూడా ఈ మూవీ కలెక్షన్స్ భారీగా సాధిస్తూ దూసుకుపోతుంది. అయితే ఇటీవలే ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జ ఏకంగా 75 సినిమాలను వదిలేసుకున్నాడట.

 ఈ ప్రాజెక్టులో నటిస్తున్నన్ని రోజులు మరో సినిమాకు ఓకే చేయలేదట తేజ. స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. హనుమాన్ సినిమా కోసం 25 సార్లు లుక్ టెస్ట్ చేశారట. ఈ సినిమాలో అన్ని తానే స్వయంగా చేశానని.. నీళ్లల్లో సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు తేజ. ఇక ఈ మూవీ తీయడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ టైంలో తాను మరే సినిమాను ఓకే చేయలేదు. పూర్తిగా హనుమాన్ మీదే దృష్టి పెట్టాను. ఇక అప్పుడు దాదాపు 75 సినిమాల ఆఫర్లు వచ్చినా వదిలేసుకున్నాను. ఇక ఇంత కష్టపడినందుకు ఈ సినిమాకి వచ్చిన విషయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ తేజ  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: