భర్తతో విడాకులు.. ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్యరాయ్?

praveen
ఇటీవల కాలం లో సినిమా ఇండస్ట్రీ లో స్టార్ కపుల్స్ విడాకుల అంశం ఎంతలా చర్చనీయాంశం గా మారిపోతుందో ప్రత్యేకం  గా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ప్రేమించి ఎన్నో రోజులపాటు ప్రేమలో మునిగితేలిన జంటలు పెళ్లి చేసుకుని.. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్నారు. అలాంటివారు ఏకంగా ఊహించని రీతిలో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి.. అభిమానులందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చారు.

 అయితే అచ్చం ఇలాగే బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అందరీ లాగానే ఇక ముందుగా వార్తలు రావడం తర్వాత వీళ్ళు విడాకుల విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుందని ఊహించారు అందరు. కానీ ఊహకందని రీతిలో ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకుపోతుంది అనే వార్తలకు ఒకే ఒక్క పోస్టుతో  చివరికి పుల్ స్టాప్ పడింది అని చెప్పాలి. ఐశ్వర్యారాయ్ ఈ విషయంపై ప్రతి ఒక్కరికి ఇండైరెక్టుగా స్పష్టత ఇచ్చింది అన్నది తెలుస్తోంది .

 ఇటీవలే తన భర్త అభిషేక్ బచ్చన్ బర్త్ డే సందర్భంగా అతను కూతురుతో దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఐశ్వర్యరాయ్. ఈ క్రమం లోనే స్పెషల్ విషెస్ తెలిపింది. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.  ఆనందం, ప్రేమ, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని కోరుకుంటున్న అంటూ కామెంట్ కూడా రాసుకొచ్చింది ఐశ్వర్యరాయ్. దీంతో గత కొంతకాలం అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలకి ఇక తన బర్త్ డే విషెస్ తో ఒక్కసారిగా క్లారిటీ ఇచ్చేసింది ఐశ్వర్యరాయ్. ఇక ఇప్పటికైనా వీరి విడాకుల వార్తలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: