అందుకే తెలుగు సినిమాల్లో కనిపించట్లేదా.. ఆఫర్ వస్తే త్రిష ఏం చేస్తుందో తెలుసా?

praveen
టాలీవుడ్ హీరోయిన్ త్రిష గురించి కొత్తగా సిని ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా కొనసాగింది. తన అందంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొని.. స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది. ఇప్పుడంటే టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమా ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు అందులో హీరోయిన్గా త్రిష సెలెక్ట్ చేసేవారు.

 అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కోలీవుడ్, బాలీవుడ్ లో మాత్రం తెగ చాన్సులు దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లియో అనే సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు ట్రీట్ ఇస్తూనే ఉంది త్రిష. అయితే ప్రస్తుతం త్రిష మళ్లీ ట్రాక్ లోకి రావడంతో ఆమె దగ్గరికి అటు టాలీవుడ్ నుంచి కూడా పలు ఆఫర్లు వెళుతున్నాయట.  ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర సినిమాలో కూడా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

 అయితే ఇప్పటికే దాదాపు అందరితో నటించి ప్రేక్షకులను అలరించిన త్రిష ఇక ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అయితే మెగాస్టార్ సినిమాతో పాటు మరో రెండు మూవీస్ కూడా లైన్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు త్రిష కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వరల్డ్ గా మారిపోయింది. అయితే కోలీవుడ్లో బాగా డిమాండ్ ఉన్న ఈ హీరోయిన్ టాలీవుడ్ ఆఫర్ అనగానే తన పారితోషకాన్ని డబుల్ చేస్తుందట. ఇక ఇలా ఎక్కువ డిమాండ్ చేయడంతో దర్శకనిర్మాతలు ఆమెను వద్దు అనుకుంటున్నారు అన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: