రాజబాబు చెప్పిన చిన్న మాటే.. సూపర్ స్టార్ కృష్ణ రెండో పెళ్లికి బీజం వేసిందట తెలుసా?

praveen
తెలుగు సినీ ప్రేక్షకులందరి చేత సూపర్ స్టార్ అని పిలిపించుకున్న కృష్ణ స్టార్ హీరోగా అప్పట్లో ఎంతలా హవా నడిపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన డైరెక్టర్, హీరోయిన్ అయినా విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. అయితే కృష్ణ ప్రేమ వివాహం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది. అయితే ఇండస్ట్రీలో వీరి జంటను డేర్ అండ్ డాష్ అండ్ కపుల్ గా కూడా పిలుచుకునేవారు.

 విజయనిర్మల-  కృష్ణ ఎప్పుడూ ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ అభిమానులను చూపించుకునేవారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి అప్పట్లో స్టార్ కమెడియన్ గా  వెలుగొందిన రాజాబాబు  ఒకానొక సమయంలో అన్న ఒక సరదా మాట కారణమట.  రాజబాబు అన్న ఒక చిన్నమాట కృష్ణ విజయనిర్మల పెళ్లికి బీజం పడేలా చేసిందట. ఈ విషయాన్ని గతంలో కృష్ణనే ఓ సందర్భంలో తెలియజేశారు. మొదటిసారి కృష్ణ -  విజయనిర్మల కాంబినేషన్ లో 1967లో సాక్షి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాజాబాబు కూడా ఒక కీలకపాత్ర పోషించారు.

 అయితే సినిమా షూటింగ్ మొత్తం రాజమండ్రి దగ్గరలోని పులి దిండి లో జరిగిందట. ఈ క్రమంలోనే మీసాల కృష్ణుడు గుడిలో పెళ్లి సన్నివేశం జరిగిందట. అయితే ఏ సన్నివేశాన్ని అయినా శాస్త్రోక్తంగా  చేసే బాపు పెళ్ళి సన్నివేశాన్ని మొత్తం నిజమైన పెళ్లిలాగే జరిపించాడట. అయితే ఇక ఈ సన్నివేశానికి చిత్రీకరిస్తున్న సమయంలో కృష్ణతో రాజా బాబు ఇలా అన్నారట. ఈ గుడి చాలా మహిమగలది.. ఇప్పుడు అబద్ధపు పెళ్లి చేసుకున్న మీరు త్వరలోనే నిజమైన పెళ్లి చేసుకుంటారు అంటూ సరదాగా అన్నారట. అప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ ఆ తర్వాత రెండేళ్లకే 1969 మార్చి 24న విజయ నిర్మల, కృష్ణ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ సమయంలో కృష్ణ మాట్లాడుతూ.. నేను సెంటిమెంట్స్ నీ నమ్మను. కానీ రాజబాబు అన్న మాటలు నిజంగా జరిగినప్పుడు ఆశ్చర్యపోయా అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: