అయ్య బాబోయ్.. మహేష్ ధరించిన ఈ జాకెట్ ధర.. అన్ని లక్షల రూపాయలా?

praveen
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న సంక్రాంతికి గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఏ మూవీలో మహేష్ బాబు తన పెర్ఫార్మన్స్ తో మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసేసాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకతీరుడు  రాజమౌళితో సినిమాకు రెడీ అవుతున్నాడు.

 అమెజాన్ అడవుల్లో అడ్వెంచర్స్ నేపథ్యంలో ఇక ఈ సినిమా తెరకెక్కబోతుంది అని ఎన్నో రోజుల నుంచి ఒక టాక్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు  కొడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే జక్కన్న సినిమా అంటే చాలు ఏ హీరో అయినా సరే కొన్ని రోజుల నుంచి ఇక సినిమాల్లో ఉండే కొన్ని సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇలాంటి పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఇటీవల ఇక ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా జర్మనీ ట్రిప్ కి వెళ్ళాడు అన్న విషయం తెలిసిందే. అక్కడ ఏకంగా ట్రెక్కింగ్ చేస్తున్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

 ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ఫోటో చూసిన తర్వాత మహేష్ బాబు ధరించిన జాకెట్ అందరిని తెగ ఆకట్టుకుంది. అయితే ఇక దాని వివరాల గురించి ప్రస్తుతం తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ జాకెట్ ధర ఏంటి అన్న విషయం గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా మహేష్ ధరించిన ఈ జాకెట్ ధర 3.18 లక్షల రూపాయలట. బ్రూనేలి కుసినెల్లి అనేది ఇటాలియన్ ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్  ఇక అత్యంత క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేయడంలో సదర్ బ్రాండ్ కి మంచి పేరుంది. ఇక క్వాలిటీ అండ్ ఇమేజ్ కి తగ్గట్లుగానే భారీ ధరలు ఉంటాయి అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: