టాలీవుడ్ ఇండస్ట్రీలో.. రిమేక్ సినిమాలకు జోలికి పోనీ డైరెక్టర్లు వీళ్లే?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా రిమేక్ సినిమాల హవా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇతర భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలను ఇక మరో భాషలో ఇంకో దర్శకుడు రీమేక్ చేయడం చేస్తూ ఉంటాం. అయితే ఇలాంటి భారీ అంచనాల మధ్య వచ్చిన రిమేక్ లు కొన్ని కొన్ని సార్లు మంచి విజయాలు సాధిస్తే ఇంకొన్నిసార్లు మాత్రం ఇక ప్లాపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఇప్పటికీ కూడా ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇలా రీమేక్ సినిమాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా రీమేక్ సినిమాలో జోలికి పోనీ డైరెక్టర్లు కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పాలి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క రీమేక్ కూడా చేయని దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
 సుకుమార్  : టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా రిమేక్ సినిమాలు జోలికి వెళ్లలేదు. తాను రాసుకున్న స్క్రిప్ట్ తోని సినిమాలని తీస్తూ ఉంటాడు.
 రాజమౌళి  : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్  డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళి.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా రీమేక్ అనే ఆలోచన చేయలేదు. తన సొంత కథలతోనే సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు.

 కొరటాల శివ : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కొరటాల శివ.. ఒక్కసారి కూడా రిమేక్ చేయడానికి సాహసం చేయలేదు. తనకు రీమేక్ చేయడం నచ్చదు అంటూ ఎన్నోసార్లు చెప్పారు. ఇక కొత్త కథలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కొరటాల శివ. అయితే ఈ డైరెక్టర్లు చేసిన సినిమాలను ఇతర డైరెక్టర్లు రీమేక్ చేశారు తప్ప. ఇక ఈ డైరెక్టర్లు మాత్రం రీమేక్ సినిమాల జోలికి వెళ్లలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: