నోయల్ కు అందుకే విడాకులు ఇచ్చాను.. ఎస్తర్ షాకింగ్ కామెంట్స్?

praveen
సినీ సెలబ్రిటీల మధ్య ప్రేమాయణం పుట్టడం  సర్వసాధారణం. అయితే ఇలా చాలామంది ప్రేమను  పెళ్లి పేరుతో ప్రమోషన్ ఇచ్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు మనస్పర్ధలతో విడిపోవడానికి సిద్ధమవుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వేస్తూ ఉన్నాయి. ఇలా ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వారిలో అటు నోయల్, ఎస్తర్ నూరాన్హ కూడా ఒకరు అని చెప్పాలి.

 ఎస్తర్ హీరోయిన్గా టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తన అందం అభినయంతో ఎంతోమంది కుర్ర కారు మతి పోగొట్టింది. ఇక నోయల్ రాప్ సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా పరిచయం ప్రేమగా మారి ఇక 2019లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా వచ్చి ఆశీర్వదించారు. అయితే పెళ్లయిన మూడు నెలలకే కొన్ని విభేదాల కారణంగా ఈ జంట విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. మీరు విడాకులకు కారణం ఏంటి అనే విషయంపై మాత్రం ఇప్పటికి ఎవరికీ అసలు నిజాలు తెలియదు.

 అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తర్ విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన మాజీ భర్త నోయల్ క్యారెక్టర్ గురించి సంచలన విషయాలు చెప్పింది. పెళ్లయిన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నాను అంటూ ఎస్తర్ చెప్పుకొచ్చింది. అతడు ప్రతి చోటా నన్ను బ్యాడ్ చేయడానికి చూసాడు. అందుకే నేను అతని నుంచి విడిపోవాలని డిసైడ్ అయ్యాను అంటూ ఓపెన్ గా చెప్పారు. అందుకే అంత త్వరగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. విడాకుల తర్వాత కూడా తనపై బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ప్రయత్నించారు అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈమె భీమవరం బుల్లోడు, 1000 అబద్దాలు, జయ జానకి నాయక లాంటి సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: