పొలిటికల్ ఎంట్రీ పై జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్..!!
ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పేరు రాజకీయాల పరంగా టిడిపి పార్టీలో వినిపిస్తూనే ఉంటుంది అభిమానులు మాత్రం తనని రాజకీయాల్లోకి రావాలని ఇప్పటికీ కోరుతూనే ఉంటారు. ఇటీవలే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కు సంబంధించి ప్రోగ్రాంలో పాల్గొన్న ఎన్టీఆర్.. పొలిటికల్ ఎంట్రీ పైన మాట్లాడుతూ మళ్ళీ రాజకీయాలలోకి ఎప్పుడు వస్తారు అని విషయాన్ని అడగగా.. ఎన్నిసార్లు చెప్పాను మళ్లీ అదే అదే ప్రశ్న అడుగుతారు అంటూ ఎన్టీఆర్ తెలిపారు.. తాను ఇక రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నారని తెలియజేశారు.
ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా టిడిపి పార్టీ నీ తన కుమారుడు లోకేష్ చేతిలో పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కేవలం తామిద్దరమే కుటుంబ సభ్యులు అనేట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. బాలయ్య కూడా నారావారి కుటుంబం సపోర్టు ఉండడం చేత.. కుటుంబంలో విభేదాలు తలెత్తాయని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కళ్యాణ్ రామ్ అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్కు మాత్రం పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి కనబరచలేదని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికలకు కూడా ఎన్టీఆర్ మద్దతు టీడీపీకిఉండదంటూ అభిమానులు తెలియజేస్తున్నారు.