నన్ను బిగ్ బాస్ లోకి పంపి.. నా భర్త ఎఫైర్ పెట్టుకున్నాడు.. నటి కామెంట్స్ వైరల్?

praveen
ఇండియన్ బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్  కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అన్ని భాషల్లో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంది ఈ కార్యక్రమం. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లాలని ఎంతోమంది ఆశ పడుతూ ఉంటారు. కెరియర్ ముగిసిపోయింది అనుకున్న దశలో బిగ్ బాస్ లోకి వెళ్లి మళ్లీ వరుస అవకాశాలు దక్కించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇక సామాన్యులను సైతం ఈ షో సెలబ్రిటీలను చేస్తూ ఉంటుంది.

 చాలామంది ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మంచి ఆఫర్లు దక్కించుకుంటూ కెరియర్ ను నిలబెట్టుకోగలిగితే ఇంకొంతమంది మాత్రం.. తమ పర్సనల్ లైఫ్ ని సైతం రిస్క్ లో పడేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఒక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారిపోయింది. ఈ షోలోకి వెళ్లడం కారణంగా నాకు కాపురం కూలిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఒక నటి. ఆమె ఎవరో కాదు మలయాళ బ్యూటీ ఆర్య. ఆమె బుల్లితెర ధారావాహికల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 ఇక ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక సినిమాలోను మంచి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల  ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఆర్య. ఈ క్రమంలోనే తన భర్తతో విడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయ పై ఓపెన్ అయింది. నా భర్త నన్ను వదిలించుకోవడానికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళమని ఫోర్స్ చేశాడు నేను బిగ్ బాస్ కి వెళ్లడానికి  సపోర్ట్ ఇచ్చాడు అనుకున్నాను. అయితే చాలా రోజుల తర్వాత నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చాను  కానీ అతను అడ్రస్ లేడు. అతని కోసం ఎంత వెతికిన ఫలితం లేదు. తర్వాత నా సోదరికి కాల్ చేస్తే అప్పుడు తెలిసింది  అతను వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని దుబాయిలో ఉన్నాడని.  కానీ నేను కోవిడ్ కారణంగా అక్కడికి వెళ్ళలేకపోయామని తెలిపింది. ఇలా నన్ను బిగ్ బాస్ లోకి పంపి అతను ప్రియురాలితో పారిపోయాడు. అలా నా భర్తతో విడిపోవాల్సి వచ్చింది అంటూ నటి ఆర్య చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: