రజనీకాంత్ కూతురు భావోద్వేగం !

Seetha Sailaja
‘జైలర్’ మూవీతో తిరిగి తన కెరియర్ లో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘సలామ్’ వచ్చేవారం విడుదలకాబోతోంది. భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ మూవీ పై పెద్దగా తెలుగు ప్రేక్షకులలో మ్యానియా ఏర్పడలేదు. దీనికితోడు ఈసినిమా రవితేజా ‘ఈగల్’ తో అదేవిధంగా ‘యాత్ర 2’ తో పోటీగా విడుదల అవుతున్న పరిస్థితులలో ఎంతమేరకు రజనీ తన ‘జైలర్’ సెంటిమెంట్ ను కొనసాగించగలుగుతాడు అన్న సందేహాలు చాలమందిలో ఉన్నాయి.

అయితే ఈసినిమాను ప్రమోట్ చేసే విషయంలో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా భాగ్యనగరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సౌందర్య కన్నీరు పెట్టుకోవడం మీడియా వర్గాలకు హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రి గొప్పతనం గురించి వివరిస్తూ అలాంటి తండ్రికి తాను కూతురుగా పుట్టడం తనయ అదృష్టం అంటూ భావోద్వేగానికి లోనైంది.

ఆమె భావోద్వేగానికి ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది షాక్ అయ్యారు. ఈసినిమాలో రజనీకాంత్ పాత్ర అతిది పాత్ర అయినప్పటికీ ఈమూవీ కథ అంతా రజనీకాంత్ చుట్టూ తిరుగుతుంది అంటున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఐశ్వర్య కంటినీరు పెట్టుకున్న విషయాన్ని రజనీకాంత్ అభిమానులతో పాటు రాజకీయ వర్గాలు కూడ చాల నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా టాప్ యంగ్ హీరోలు సీనియర్ హీరోలు చిన్న సినిమాల తాకిడిని చాల నిశితంగా పరిశీలిస్తున్నారు. ‘లాల్ సలామ్’ మూవీలో సెంటిమెంట్ సీన్స్ విపరీతంగా ఉంటాయని ఈమూవీని ఇప్పటికే చూసిన ప్రేక్షకులు చెపుతున్నారు. అయితే మూవీకి సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ చాల మంచి ట్యూన్స్ ఇచ్చాడు అన్న ప్రచారం కూడ జరుగుతోంది. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలను చూసే ప్రేక్షకులు బాగా తగ్గిపోతున్నారు. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులను కూడ లెక్క చేయకుండా ‘లాల్ సలామ్’ కేవలం రజనీకాంత్ మ్యానియాను బేస్ చేసుకుని విడుదలచేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: