చిరుతో ఆ క్రేజీ డైరెక్టర్ మూవీ ఆగిపోలేదు..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం మొదటగా వాల్టేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించి సూపర్ సక్సెస్ ను అందుకున్న చిరంజీవి ఆ తర్వాత భోళా శంకర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి కాగా ఈ రోజు నుండి ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయింది.


ఇందులో చిరంజీవి కూడా జాయిన్ అయ్యాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో పాటు చిరంజీవి , హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీ లో కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో చిరంజీవి ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.


ఇకపోతే అనిల్ తన తదుపరి మూవీ ని చిరంజీవి తో కాకుండా వెంకటేష్ తో చేయబోతున్నట్లు వార్తలు రావడంతో చిరు , అనిల్ కాంబో మూవీ క్యాన్సిల్ అయింది అని వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరు , అనిల్ కాంబో మూవీ క్యాన్సర్ కాలేదు అని ప్రస్తుతం చిరంజీవి ఇతర కమిట్మెంట్ లతో బిజీగా ఉండడంతో అనిల్ ఆ సినిమా పనులను పక్కన పెట్టి వెంకటేష్ తో సినిమా చేయనున్నట్లు మళ్లీ చిరంజీవి ఫ్రీ కాగానే ఆయనతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: